చిన్న ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన స్టాక్ మార్కెట్.. భర్త చేసిన పనికి భార్య బలవన్మరణం.. ఏం జరిగిందంటే?
అదో చిన్న కుటుంబం.. మూడేళ్ల బాబు, భార్య, భర్త.. అప్పటి వరకు హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో స్టాక్ మార్కెట్ మార్కెట్ అనే భూతం ఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజుల్లోని ఆ ఫ్యామిలీని చిన్నా భిన్నం చేసేసింది. భర్తకు భార్య, బాబుకు తల్లిని దూరం చేసింది. ఇంతకు ఆ కుటుంబంలో ఏం జరిగింది. ఆ ఫ్యామిలీకి ఇల్లాలు ఎందుకు దూరమైందో తెలుసుకుందాం పదండి.

స్టాక్‌మార్కెట్‌లో డబ్బులు సంపాధించి ఎంత మంది బాగుపడ్డారో.. దాని వల్ల అప్పులపాలై అవి కట్టలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా అంతే మంది ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. అప్పటి వరకు ఆనందగా సాగిపొతున్న ఒక కుటుంబంలో ఈ స్టాక్ మార్కెట్ చిచ్చుపెట్టింది. ఈ స్టాక్ మార్కెట్ కారణంగా ఫ్యామిలీలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి భార్య భర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే భార్య ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా కృష్ణదేవి పేట కొంగశింగి గ్రామానికి చెందిన అరిట ప్రసాద్, లక్ష్మీపార్వతిలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. ప్రసాద్ నేవీలో పనిచేసేవాడు. అయితే ఇతను ఇటీవలే రిటైర్ కాగా అతనికి పదవి విరమణకు కింద డబ్బు వచ్చింది. అయితే ప్రసాద్ ఆ డబ్బునంతా షేర్ మార్కెట్‌లో పెట్టాడు. కానీ అందులో ప్రసాద్ పూర్తిగా నష్టపోయాడు. భార్య ఎంత చెప్పినా వినకుండా ప్రసాద్ డబ్బును మొత్తం షేర్ మార్కెట్‌లో పెట్టి అప్పుల పాలయ్యాడు. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇవి కాస్తా భార్య భర్తల మధ్య గొడవలకు దారి తీశాయి.
పదవీ విరమణ తరవాత వచ్చిన డబ్బుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామనుకున్న తమ కలలను భర్త నాశనం చేయడంతో.. భార్య లక్ష్మీపార్వతి నిలదీసింది. ఈ క్రమంలోనే భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీపార్వతి రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. భర్త ఎంత పిలిచినా భార్య డోర్ తీయకపోయే సరికి అనుమానం వచ్చిన ప్రసాద్ స్థానికుల సహాయంతో ఎలాగోలా తలుపులు తెరిచి రూమ్‌లోకి వెళ్లాడు.
అక్కడ విగతజీవిగా ఉన్న భార్యను చూసి షాక్ అయ్యాడు. ఇక విషయం తెలుసుకున్న లక్ష్మీపార్వతి తల్లిదండ్రులు ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్ట నిమిత్తం హాస్పిటల్ కు తరలించి. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
