Konijeti Rosaiah Statue: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సూర్య శిల్పశాల మరో ఘనతను సొంత చేసుకుంది. ఇటీవల ఐరన్ స్క్రాప్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను తయారు చేసిన సూర్యశిల్పశాల తాజాగా.. మరో అద్భుతమైన విగ్రహాన్ని కాంస్య, ఫైబర్ మెటీరియల్స్‌తో రూపొందించింది. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య విగ్రహం తెనాలి సూర్య శిల్పశాలలో రూపుదిద్దుకుంది. రోశయ్య మరణానంతరం వారి అభిమానులు, స్నేహితులు తమ తమ ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పలువురి కోరిక మేరకు శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు రవి చంద్ర తో కలిసి అద్భుతమైన రోశయ్య విగ్రహ తయారు చేసారు.
ఈ సందర్భంగా శిల్పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కేవలం ఐదు రోజుల్లోనే రోశయ్య విగ్రహం తయారు చేసినట్లు చెప్పారు. త్వరలోనే రోశయ్య నిలువెత్తు విగ్రహాలు తయారు చేయనున్నట్టు వెల్లడించారు. కాంస్య, ఫైబర్ మెటీరియల్స్ తో ఈ విగ్రహాలు తయారు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి విగ్రహాల కోసం ఆయన అభిమానులు ఫోన్లు చేసి అడుగుతున్నట్టు శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు వెల్లడించారు.
టి. నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు.
Also Read: