Statue of Equality: అట్టహాసంగా శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ఐదవ రోజు వేడుకలకు హాజరైన పవన్, హైకోర్టు చీఫ్ జస్టిస్..

|

Feb 06, 2022 | 10:09 PM

Statue of Equality: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఐదవ రోజు ఘనంగా జరుగాయి. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా తొలుత పరమేష్ఠి యాగాన్ని..

Statue of Equality: అట్టహాసంగా శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ఐదవ రోజు వేడుకలకు హాజరైన పవన్, హైకోర్టు చీఫ్ జస్టిస్..
Follow us on

Statue of Equality: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఐదవ రోజు ఘనంగా జరుగాయి. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా తొలుత పరమేష్ఠి యాగాన్ని నిర్వహించారు. తీవ్రమైన వ్యాధుల నివారణకు ఈ యాగాన్ని నిర్వహిస్తారని త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలియజేశారు. ఈ యాగాన్ని ఐదువేల మంది రుత్వికులు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. పితృదేవతలను తృప్తి కోసం, పితృ దోష నివారణ కోసం వైభవేష్టి హోమాలను నిర్వహించారు. నాలుగు వేదాలలోని మంత్రాలను పఠిస్తూ 114 యాగశాలలో 1,035 హోమ గుండాల్లో ఏకధాటిగా లక్ష్మీనారాయణ మహా క్రతువు ఘనంగా జరుగుతోంది.

అనంతరం ప్రవచనం మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామ పూజ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో భక్తులు ఆచరించారు. ఈ పూజ ఫలితాన్ని దేవనాథ రామానుజ జీయర్ భక్తులకు వివరించారు. అనంతరం సింహాచలం స్థానాచార్యులు టివి రాఘవాచార్యులు.. భగవద్రామానుజుల వైభవాన్ని తెలియజేశారు. రాజస్థాన్‌లోని పుష్కర నుంచి విచ్చేసిన జగద్గురు రామచంద్ర ఆచార్య హిందీలో అందించారు. అనంతరం టెకెవీ రాఘవన్ అందించిన స్ఫూర్తి ప్రవచనం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. సమకాలీన అంశాలను స్పృశిస్తూ రామానుజ స్ఫూర్తి అందించారు. ప్రముఖ తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రామనుజాచార్య విశిష్టతలపై పాటల రూపంలో తెలియచేసారు.

ఆ తర్వాత ప్రవచన మండపంలో పలు సంగీత కార్యక్రమాలు జరిగాయి. గాయత్రీరావు అందించిన సంగీత కార్యక్రమాలు దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. గొల్ల శ్రీనివాస్ బృందం నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను కట్టిపడేసింది. పెదప్రోలు భావన బృందం వారి కూచిపూడి నృత్యం అందరినీ విశేషంగా అలరించింది. శ్రీకృష్ణుడిగా జాబిలి అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఐదో రోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రజ్ఞ విద్యార్థులతో నిర్వహించిన అవధాన కార్యక్రమం ఆకట్టుకుంది. త్రిదండి చిన్న జీయర్ స్వామి సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగడం విశేషం. అమెరికన్ విద్యార్ధులు తమ విశేష ప్రతిభను కనబరిచారు. ప్రజ్ఞ అమెరికా సెక్రటరీ రాజేష్ వారి బృందం ఈ విశేష కార్యక్రమాన్ని నిర్వహించింది. సాయంత్రం ప్రవచన మండపంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ త్రిదండి చిన్న జీయర్ స్వామి సమక్షంలో జరిగింది. అనంతరం శ్రీనివాస్ వీణపై రోణు మజుందార్ వేణువుపై నిర్వహించిన జుగల్బందీ వీణ వేణు వినోద కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. చివరగా సముద్రాల మాధవి బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మరో వైపు సమతా మూర్తి ప్రాంగణంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని చూడడానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు విగ్రహాన్ని సందర్శించారు.

ప్రముఖుల రాక..
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్, జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ 216 అడుగుల సమతమూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన భవంతి ప్రాంగణంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 216 అడుగుల సమతమూర్తి విగ్రహ ఆవిష్కరణతో త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి సంకల్పం నెరవేరిందన్నారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ అవిష్కరించటం శుభపరిణామం అన్నారు. శ్రీ రామనుజాచార్య విగ్రహ ఆవిష్కరణతో భవిష్యత్ తరాలకు సమతా సందేశం అందుతుందన్నారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు జస్టిస్ పోనగంటి నవీన్ రావు, జస్టిస్ అభిషేక్ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, సమతా మూర్తిని దర్శించుకుని త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళ శాసనాలు అందుకున్నారు.

రేపటి కార్యక్రమాలు..
‌దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టి యాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించనున్నారు. వీటితో పాటు ప్రముఖులచే ప్రవచనాలు, విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.

Also read:

Cigarette Addiction: సిగరెట్ వ్యసనం, కాబట్టి ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి, వ్యసనం నుండి బయటపడటం సులభం అవుతుంది

Viral News: లక్ అంట్ ఇతనిదే.. చికెట్ కోసం కొట్టుకు వెళ్లి.. 75 లక్షలతో తిరిగొచ్చాడు.. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియని ఆసక్తికర విశేషాలు మీకోసం..