AP Government: మహిళ పోలీసు విభాగం ఏర్పాటు.. మహిళా పోలీసులుగా గ్రామ సంరక్షణ కార్యదర్శులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

|

Jan 12, 2022 | 9:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో మహిళ పోలీసు విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డు, గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులుగా మారనున్నారు.

AP Government: మహిళ పోలీసు విభాగం ఏర్పాటు.. మహిళా పోలీసులుగా గ్రామ సంరక్షణ కార్యదర్శులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Ap Secretariat
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో మహిళ పోలీసు విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డు, గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులుగా మారనున్నారు. సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరి ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిషకేషన్ జారీ చేసింది. మొత్తం ఐదు విధాలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. నేరుగా నియామకాల ద్వారా 90 శాతం మహిళా పోలీసులను భర్తీ చేస్తారు. మరో ఐదు శాతం మందిని భర్తీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల లో మహిళా పోలీస్ వారి పూర్తి సర్వీస్ రూల్స్ తో కూడిన GO.MS.NO-1విడుదల చేశారు. మొత్తం 5 కేటగిరీలలో పదోన్నతులు లభించాయి.

1. మహిళా పోలీస్ గా కనీసం ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సీనియర్ మహిళా పోలీస్ కు అర్హత సాధిస్తారు
2. సీనియర్ మహిళా పోలీస్ గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినట్లయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు.
3.అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు.
4. సబ్ ఇన్స్పెక్టర్( మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన తో ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) నాన్ గెజిటెడ్ కు అర్హత సాధిస్తారు.

ఇవి కూడా చదవండి: Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Viral Video: పక్షులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నాయి.. ఏ అంశంపై డిస్కషన్ చేస్తున్నాయో చెప్పుకోండి చూద్దాం..