Narayana Arrest: నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌తో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. జరుగుతున్న వ్యవహారం అంతా ముందే పసిగట్టి పారిపోదాం అనుకున్నారా! ఐదు రోజుల్లో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అదే నిజమనిపిస్తుంది. తన అరెస్ట్‌ను ముందుగానే ఊహించారా? ఐకియా దగ్గర పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకున్నారుగానీ.. లేదంటే కాసేపట్లో ఆయన ఎయిర్‌పోర్ట్ రూట్‌కి కనెక్ట్ అయ్యేవారట. ఒకవేళ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఫ్లైట్ ఎక్కేస్తే డెస్టినేషన్ ఎటువైపు! పారిపోదామనుకున్న ఆయన్ను ప్లాన్‌ను ఐకియా దగ్గర ఏపీ పోలీసుల స్కెచ్ భగ్నం చేసిందా! మాజీ మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి ఫ్లైట్ ఎక్కాల్సి ఉందన్నది సమాచారం. ఆయన నాందేడ్‌లోని తన విద్యాసంస్థతో కాన్ఫరెన్స్ ఉందంటున్నారు. కానీ.. వాస్తవానికి ఆయన పారిపోయే ప్రయత్నం చేశారన్నది మరో కోణంలో వినిపిస్తున్న ఆసక్తికర అంశం.
నారాయణకు హైదరాబాద్‌లో మొత్తం 5 నివాసాలున్నాయి. మాదాపూర్‌లో 2, గచ్చిబౌలిలో ఒకటి, కొండాపూర్‌లో ఒకటి, కూకట్‌పల్లిలో మరొకటి. వాస్తవానికి పదో తరగతి పరీక్షల మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం, పదుల సంఖ్యలో టీచర్ల అరెస్ట్ తర్వాత ఏదో జరగబోతోందన్నది నారాయణ ముందుగానే ఊహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన హైదరాబాద్ వచ్చిన ఐదు నివాసాల్లో మార్చి మార్చి ఉంటున్నట్లు చెబుతున్నారు. ఏ రోజు ఎక్కడ ఏ టైమ్‌కు ఉంటున్నారో కూడా కుటుంబానికి తప్ప మూడో మనిషికి తెలీదన్నది టాక్.
ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. ఏపీ నుంచి వచ్చిన పోలీసులు వ్యవహారం తెలంగాణ పోలీసులకూ తెలీదు. కానీ.. ఇదేదో జరగబోతున్నట్లు నారాయణ ఊహించినట్లే ఉన్నారు. అయితే.. ఆయన ఐదు నివాసాలపైనా అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు.. అన్నింటి కామన్‌గా ఉన్న ఐకియాలో నిఘా పెట్టారు. ఆయన ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా ఐకియా జంక్షన్‌ను టచ్ చెయ్యాల్సిందేనని ఫిక్సయ్యారు. సరిగ్గా ఇవాళ ఫ్యామిలీతో సహా వెళ్తున్న నారాయణను అదుపులోకి తీసుతున్నారు. అయితే కుటుంబం మాత్రం ఆయన నాందేడ్ వెళాల్సి ఉందని, ఆ పనిలో ఉండగానే పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతున్నారు.
టెన్త్ పేపర్ల లీకేజీలో తీగ లాగితే డొంక మొత్తం కదిలింది. నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌ను.. ప్రధాన నిందితుడిగా తేల్చారు. మాల్ ప్రాక్టీస్‌కు సంబంధించి గిరిధర్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే నారాయణను అరెస్ట్ చేశారు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు. నారాయణ విద్యాసంస్థల్లో తెలుగు, హిందీ, సోషల్ స్టడీస్‌లో స్టూడెంట్స్ వీక్‌గా ఉంటారని, అందుకే పేపర్ల లీకేజీకి పాల్పడినట్లు ఇంటరాగేషన్‌లో ఒప్పుకున్నాడు గిరిధర్. దీంతో నారాయణ కాలేజీల అసలు వ్యవహారం తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.