
నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) మహాక్షేత్రంలో వేసవి సెలవులు, వారాంతపు సెలవులతో భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దర్శనాలు విషయంలో మార్పులు చేశారు. ఈరోజు (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలు నిలుపుదల చేశారు. భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ముందస్తుగా ఆన్‌లైన్‌లో స్పర్శ దర్శనం టికెట్స్ పొందిన భక్తులకు యధావిధిగా స్పర్శ దర్శనం కొనసాగిస్తామని, శ్రీస్వామి అమ్మవారి భక్తులందరూ గమనించి దేవస్థానానికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు భక్తులను కోరారు. ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు ఈ మార్పును గమనించి దేవస్థానానికి సహకార సహకరించవలసిందిగా కోరారు.
క్యూ కాంప్లెక్స్ ఉదయం వేళలో వేడిపాలను అందజేయడం జరుగుతుందన్నారు. మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు కూడ నిరంతరం భక్తులకు అందిస్తామన్నారు. ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్‌లో కూడా మంచినీటిని నిరంతరం భక్తులకు అందిస్తామన్నారు. క్షేత్ర పరిధిలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో కూడా మంచి నీటితోపాటు మజ్జిగను కూడా భక్తులకు అందిస్తున్నామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.