Watch Video: శ్రీశైలం మల్లన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎక్కువగా ఆ కరెన్సీ నోట్లు..

| Edited By: Srikar T

Aug 23, 2024 | 8:39 PM

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంతోపాటూ ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా చేపట్టారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.3 కోట్ల 22 లక్షల 53 వేల 862 రూపాయల నగదు రాబడిగా లభించింది.

Watch Video: శ్రీశైలం మల్లన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎక్కువగా ఆ కరెన్సీ నోట్లు..
Srisailam
Follow us on

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంతోపాటూ ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా చేపట్టారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.3 కోట్ల 22 లక్షల 53 వేల 862 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 20 రోజులుగా శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 150 గ్రాముల 100 మిల్లి గ్రాములు బంగారం, అలానే వెండి 5 కేజీల 250 గ్రాములను మొక్కులుగా చెల్లించినట్లు తెలిపారు. స్వదేశీ నగదు, బంగారుతో పాటు 746 యుఎస్ఏ డాలర్లు, ఆస్ట్రేలియా డాలర్స్ 50, కెనడా డాలర్స్ 125, యూకే పౌండ్స్ 70, యూఏఈ దిరామ్స్ 50, సింగపూర్ డాలర్లు 26, యూరోస్ 20 ఇలా వివిధ దేశాల కరెన్సీ ఈ లెక్కింపులో బయటపడ్డాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానానికి సంబంధించిన అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..