Srikakulam Sunday Lockdown: శ్రీకాకుళంలో సండే కర్ఫ్యూపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సకలం బంద్ అంటూనే వైన్ షాపులకు పర్మిషన్ ఇవ్వడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మందు మాటున జనాలు యథేచ్ఛగా రోడ్లపైకి వస్తుంటే అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం రోజుకి 15 గంటల పాటు వెసులుబాటు కల్పించింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. కానీ ఆ ఆదేశాలు ఎవరూ ఖాతరు చేయడం లేదు. జనాలు రోజులాగే రోడ్ల మీదకు వస్తున్నారు.
శ్రీకాకుళంలో ఆదివారం వేళ చికెన్, మటన్ షాపులతో పాటు ఇతర దుకాణాలన్నీ క్లోజ్ అయ్యాయి. కానీ వైన్ షాపులు మాత్రం తెరిచారు. చాలామంది అక్కడ క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్స్ గాలికొదిలేశారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ఎవరూ ఇటువైపు రాలేదు. పెద్ద సంఖ్యలో మందుసీసాలకోసం జనం ఒకరి మీద ఒకరు పడుతున్న దృశ్యాలు నగరంలో అనేకం.
సండే సంపూర్ణ లాక్‌డౌన్ అని పెద్ద ఎత్తున ప్రకటనలిచ్చి.. వైన్‌షాపులకు ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. అధికారుల తీరుతో సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొందరికి పర్మిషన్ ఇచ్చి మరికొందర్ని ఇంటికే పరిమితం చేయడం వల్ల ఏమి లాభమని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా కరోనా కట్టడికి చిత్తశుద్ధితో చర్యలు, అడుగులు వేయాలని కోరుతున్నారు.
Read also: Guntur: నీ భార్యను నేను ప్రేమించాను. నువ్వు అడ్డు తప్పుకోలేదంటే..! అంటూ బ్లేడుతో ఒళ్ళంతా చెక్కేశాడు