Manhandling: గుంటూరులో దారుణం.. సర్టిఫికెట్ల కోసం వెళ్లితే రూమ్‌లో బంధించి కొట్టారు.. కారణమేంటంటే..

|

Jan 14, 2021 | 7:59 PM

Manhandling: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన ఓ యువకుడిని గుంటూరులో..

Manhandling: గుంటూరులో దారుణం.. సర్టిఫికెట్ల కోసం వెళ్లితే రూమ్‌లో బంధించి కొట్టారు.. కారణమేంటంటే..
Follow us on

Manhandling: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన ఓ యువకుడిని గుంటూరు జిల్లాలో చితకబాదారు. వివరాల్లోకెళితే.. కడప జిల్లా మైదుకూరు మండలం భూమాయపల్లెకు చెందిన వెంకట జితేంద్ర శ్రీహర్ష డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నాడు. అయితే, మధ్యలోనే అకాడమీ మారాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో తన సర్టిఫికెట్ల కోసం వెంకట జితేంద్ర.. శ్రీహర్ష డిఫెన్స్ అకాడమీకి వెళ్లాడు. అయితే, అకాడమీ మారాడన్న కారణంగా జితేంద్రపై శ్రీహర్ష డిఫెన్స్ అకాడమీ ఉద్యోగులు దాడికి పాల్పడ్డారు. రూమ్‌లో బంధించి చితక్కొట్టారు.

అయితే ఆ గాయాలతోనే బాధితుడు జితేంద్ర మైదుకూరుకు వచ్చాడు. జరిగిన విషయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిపాడు. దాంతో వారు జితేంద్రను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీహర్ష డిఫెన్స్ అకాడమీ యాజమాన్యంపై మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మైదుకూరు పోలీసులు.. కేసును గుంటూరుకు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఆల్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. దాడికి పాల్పడిన సదరు అకాడమీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read:

బ్రేకింగ్, కోవిడ్ ఎఫెక్ట్, ఈ సారి గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలెవరూ చీఫ్ గెస్టులుగా రాబోరు, కేంద్రం ప్రకటన

TRS Party: మంత్రి కేటీఆర్‌కు కొత్త తలనొప్పి.. సిరిసిల్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో నేతల మధ్య లొల్లి..