Ganjai Action Plan: గంజాయిపై యుద్ధం ప్రకటించిన ఏపీ పోలీసులు.. కేసులో పట్టుబడితే ప్రభుత్వ పథకాలు కట్
ఏజెన్సీలో ప్రధాన సమస్య గంజాయి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఈ గంజాయి ఏపుగా పెరుగుతుంది అనేది నిత్య సత్యం. అంతరాష్ట్ర స్పెండర్లో అల్లూరి మన్యంలో పండే గంజాయి కన్నేసి..అక్రమంగా గంజాయిని ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారు.
Ganjai Action Plan in Visakha: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ లో మాయని మచ్చగా మారిన గంజాయి పై.. పోలీసులు యుద్ధమే ప్రకటించారు. అల్లూరి జిల్లాలో పోలీసులు సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అందుకోసం… ఇప్పటికే పాత గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిని మోటివేట్ చేయడం ద్వారా.. గంజాయికి దాదాపుగా బ్రేక్ వేయవచ్చు నది పోలీసుల భావన. ఈసారి గంజాయి కేసుల్లో పట్టుబడితే.. ప్రభుత్వ పథకాలు కట్ చేయడంతో పాటు.. రెండు లక్షల రూపాయలు కచ్చితంగా తిరిగి చెల్లించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో.. ఏజెన్సీలోని 11 మండలాలతో పాటు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ 11 మండలాలు కలిపి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడింది. అయితే ఏజెన్సీలో ప్రధాన సమస్య గంజాయి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఈ గంజాయి ఏపుగా పెరుగుతుంది అనేది నిత్య సత్యం. అంతరాష్ట్ర స్పెండర్లో అల్లూరి మన్యంలో పండే గంజాయి కన్నేసి.. గిరిజనులకు మాయమాటలతో మచ్చిక చేసుకుని.. కోట్ల రూపాయల గంజాయిని తరలించిపోయేవారు. అయితే పోలీసులకు ఎన్ఫోర్స్మెంట్ వర్గాలకు పట్టుబడుతున్న వారు మాత్రం అమాయక గిరిజనులే. అయితే గిరిజనుల సహకారం లేనిదే.. గంజాయిని సరిహద్దులు దాటించలేరని ఇప్పుడు అధికారుల నమ్మకం. అందుకే ముళ్ళను ముళ్ళు తీయాలని సూత్రాన్ని ఫాలో అవుతున్నారు పోలీసులు. రూట్ లెవెల్ లో గంజాయిని కూడా చేయాలంటే స్థానికంగా ఉండే గిరిజనులను మోటివేట్ చేయాలనేది పోలీసుల భావన. అందుకే ఇప్పటివరకు కేసులతో సరిపెట్టుకునే పోలీసులు.. ఇప్పుడు గంజాయిలో కేసుల్లో పట్టుబడిన స్థానికులపై కన్నేసి .. వారిని నియంత్రిస్తున్నారు. ఆయా కేసుల్లో ఇప్పటికే పట్టుబడిన వారిని.. వెతికి మరీ బైండోవర్లు చేస్తున్నారు. ఇకపై గంజాయి కేసుల్లో పట్టుబడితే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తారు. అంతేకాదు మరో రెండు రక్షాలు తిరిగి చెల్లించాల్సిందేనని నిబంధన పెట్టారు. అందుకోసం రెవెన్యూ అధికారుల ఎదుట పాత గంజాయి కేసులో పట్టుబడిన వారిని బయట వాళ్ళు చేస్తున్నారు.
అల్లూరు ఏజెన్సీ వ్యాప్తంగా.. ఆపరేషన్ గంజాయి సరికొత్త యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు పోలీసులు. గంజాయి రవాణా… సాగు చేస్తు 10ఏళ్ల గా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి కేసులు నమోదైన వారిపై బైండోవర్ చేస్తున్నరు పోలీసులు. పాడేరు తహసీల్దార్ ఎదుట 69 మందికి బండోవర్ చేశారు. ముంచింగి పుట్టుల్ లో 42 మంది, పెదబయలులో 30, హుకుంపేటలో 27, జీ. మాడుగుల 40 పైన బైండోవర్ కేసులు నమోదు చేసారు.
ఇలా ఇప్పటివరకు ఏజెన్సీ వ్యాప్తంగా 250 మంది వరకు బైండోవర్లు చేశారు. ఇకముందు గంజాయి కేసులో పట్టుపడితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్… రెండు లక్షల వరకు జరిమానా అని సూచనలు జారీ చేస్తూ.. బైండోవర్లు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు దూరమవడంతో పాటు.. రెండు లక్షలు తిరిగి చెల్లించాలంటే నాలుగు సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఈ గంజాయి మాకొద్దు బాబు అంటూ గిరిజనులు ప్రతిన పూనుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Reporter : khaja, Tv9 Telugu