Andhra Pradesh: కన్న కొడుకే అమె పాలిట కాలయముడైయ్యాడు.. తల్లిని కొట్టి చంపిన కొడుకు!

కన్న కొడుకే అమె పాలిట యముడైయ్యాడు. కని పెంచిన కొడుకే మద్యానికి బానిసై కడతేర్చాడు. అదీకూడా మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని రోకలి బండతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. ఈ అమానుష ఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలం వడ్డుగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది.

Andhra Pradesh: కన్న కొడుకే అమె పాలిట కాలయముడైయ్యాడు.. తల్లిని కొట్టి చంపిన కొడుకు!
Son Killed Mother
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 11, 2024 | 8:49 PM

కన్న కొడుకే అమె పాలిట యముడైయ్యాడు. కని పెంచిన కొడుకే మద్యానికి బానిసై కడతేర్చాడు. అదీకూడా మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని రోకలి బండతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. ఈ అమానుష ఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలం వడ్డుగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది.

పాణ్యం మండలం వండుగండ్ల గ్రామానికి చెందిన గోపాల్, నాగలక్షమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. గోపాల్ అమె భార్య నాగలక్షమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమార్తెల తర్వాత పుట్టిన కొడుకును ఎంతో గారాబంగా పెంచారు తల్లిదండ్రులు. కొడుకు మహేష్ ఎటువంటి పనులు చెయ్యకుండా మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు. కన్న కొడుకు పెట్టే బాధలను తల్లిదండ్రులు భరిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో బుధవారం గోపాల్ పొలం పనుల కోసం బయటకు వెళ్ళాడు. మహేష్ మద్యం తాగేందుకు తల్లిని డబ్బులు అడగగా, అందుకు తల్లి నిరాకరించింది. ఈ క్రమంలోనే తల్లి, కొడుకుల మద్య మాటామాట పెరిగి, ఇంట్లో ఉన్న రోకలి బండతో తల్లి నాగలక్షమ్మపై గట్టిగా కొట్టాడాడు. దీంతో ఆమె అక్కడికక్కడే రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తండ్రి గోపాల్ మాత్రం తన కొడుకు మహేష్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని, అందువలనే ఇలా జరిగిందని పోలీసులకు చెబుతున్నారు. మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తూన్నారు.

ఏది ఏమైనప్పటికీ కన్న తల్లిని కొడుకును విచక్షణారహితంగా రోకలిబండతో కొట్టి చంపడం అందరిని కలచి వేసింది. మతిస్థిమితం లేక తల్లిని చంపాడా లేక ఉద్దేశపూర్వకంగా చంపాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త