Somu Veerraju: పవన్‌, చంద్రబాబు భేటీపై స్పందించిన సోము వీర్రాజు.. కన్నా వ్యవహారంపై మాట దాటివేత

|

Oct 20, 2022 | 1:31 PM

ప్రజా సమస్యలపై పోరాడేందుకే జనసేన టీడీపీ తో కొనసాగుతోందని, ఎక్కడా పొత్తులపై మాట్లాడలేదని బీజేపీ చీఫ్ చెప్పుకొచ్చారు అయితే కన్నా లక్ష్మీ నారాయణ పెద్దవారని, ఆయన విషయంలో తానేమీ మాట్లాడనంటూ మాట దాటవేశారు.

Somu Veerraju: పవన్‌, చంద్రబాబు భేటీపై స్పందించిన సోము వీర్రాజు.. కన్నా వ్యవహారంపై మాట దాటివేత
Somu Veerraju
Follow us on

Somu Veerraju: పవన్‌, చంద్రబాబు భేటీపై స్పందించిన సోము వీర్రాజు.. కన్నా వ్యవహారంపై మాట దాటివేతటీడీపీ- జనసేన పొత్తులపై వస్తోన్న వార్తలు, కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం తదితర విషయాలపై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకే జనసేన టీడీపీ తో కొనసాగుతోందని, ఎక్కడా పొత్తులపై మాట్లాడలేదని బీజేపీ చీఫ్ చెప్పుకొచ్చారు అయితే కన్నా లక్ష్మీ నారాయణ పెద్దవారని, ఆయన విషయంలో తానేమీ మాట్లాడనంటూ మాట దాటవేశారు. విజయవాడలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ ధియోదర్‌తో కలిసి మాట్లాడిన ఆయన.. ‘సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మతానికి అనుకూలంగా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత దేవాలయాలపై దాడులు పెరిగాయి. విజయనగరంలో రాముడి శిరచ్ఛేదం, రథం దగ్దం వంటివి హిందూ మనోభావాలను దెబ్బతీశాయి. బీజేపీ ఆందోళన తర్వాత దాడులు తగ్గాయి. అయితే దేవాలయాల్లో దాడులకు పాల్పడిన వారిలో ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. అదే సమయంలోవైఎస్సార్ విగ్రహం చెయ్యి ధ్వంసం కేసులో వెంటనే అరెస్టులు జరిగాయి. జగన్ ప్రవృత్తి ఆధారంగా అరెస్టులు జరుగుతున్నాయి.కనపర్తి లో పదో శతాబ్దం నాటి నంది విగ్రహం ద్వంసం జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తుంటే అనవసరమైన ఉద్రిక్తతలు చేస్తున్నామంటూ ఎస్పీ మాట్లాడుతున్నారు. మాపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపై కేసులు పెడతాం అనడం సమంజసం కాదు. ఎస్పీతన వైఖరి మార్చుకోవాలి’

కన్నా వ్యాఖ్యలపై ..

‘ఇక రాహుల్ గాంధీకి ఏపీలో పాదయాత్ర చేసే అర్హత లేదు. భద్రాచలం రాముడిని ఆంధ్రకు కాకుండా చేశారు. అమరావతిలోని రాజధాని ఉండాలని, అభివృద్ధి జరగాలని హైవేల నిర్మాణం కోసం పది వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. అదే సమయంలో విశాఖలో డీసెంట్లైజేషన్ కోసం జగన్ ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. యూపీ, బీహార్ కి కూడా ఏపీకి ఇచ్చినన్ని నిధులు ఇవ్వలేదు. ఏపీని స్ట్రాటికల్ స్టేట్ గా నిర్మించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారు. ఇక మేము జనసేన తోనే ఉన్నాం. జనసేన, టీడీపీ ప్రజాస్వామ్యం పరిరక్షణకు పోరాడుతున్నాం అన్నారు. అంతేగాని పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదు. నేను నా పద్ధతిలో వెళ్తుంటాను. నేను ఇరకటంలో పడలేదు. అంతా సవ్యంగానే ఉంది. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది. నేను ఢిల్లికీ వెళ్ళలేదు.. బెంగుళూరుకు వెళ్లి వచ్చాను. ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో భేటీ అయ్యాననేది ప్రచారం మాత్రమే. సునీల్ ధియోధర్ ఢిల్లీ నుండి విజయవాడకు వచ్చారు. కన్నా లక్ష్మీ నారాయణ పెద్దవారు.. ఆయన విషయంలో నేను ఏమీ మాట్లాడను’ అని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..