Watch Video: స్కూటీ డిక్కీలో వింత శబ్ధాలు.. తెరిచి చూస్తే షాక్.. అసలు ట్విస్ట్ అదుర్స్..
ఓ వ్యక్తి స్కూటీ మీద వెళుతున్నాడు. అలా వెళుతున్న ఆ వ్యక్తికి.. ఎక్కడి నుంచో బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. స్కూటీ రోడ్డు పక్కకు ఆపి ఏముందో చూసి షాక్ అయ్యాడు వాహనదారుడు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత నిలయం వద్ద రోడ్డుపై వెళ్తున్న ఓ స్కూటీలో పాము దర్శనమిచ్చింది. స్కూటీ సీట్ కింద పామును చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్పటివరకు ఆ స్కూటీ మీదే గంటసేపు తిరిగిన వాహనదారుడు ఏకంగా షాక్‌కు గురయ్యాడు.
ఓ వ్యక్తి స్కూటీ మీద వెళుతున్నాడు. అలా వెళుతున్న ఆ వ్యక్తికి.. ఎక్కడి నుంచో బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. స్కూటీ రోడ్డు పక్కకు ఆపి ఏముందో చూసి షాక్ అయ్యాడు వాహనదారుడు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత నిలయం వద్ద రోడ్డుపై వెళ్తున్న ఓ స్కూటీలో పాము దర్శనమిచ్చింది. స్కూటీ సీట్ కింద పామును చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్పటివరకు ఆ స్కూటీ మీదే గంటసేపు తిరిగిన వాహనదారుడు ఏకంగా షాక్‌కు గురయ్యాడు. స్కూటీ డిక్కీలో పాము దూరిన సంగతి తెలియక వాహనదారుడు అప్పటివరకు దాని మీదే తిరుగుతూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక బుసలు కొడుతున్న శబ్ద విని రోడ్డు పక్కకు ఆపి చూశాడు. ఆ వాహనదారుడు అందులో ఏముందో చూసి కంగుతిన్నాడు. ఎప్పుడు దూరిందో ఏమో తెలియదు గానీ బయటకు తీసిన పామును చూసి భయాందోళనకు గురయ్యాడు.
ఎంతసేపటికి స్కూటీ సీట్లోంచి పాము బయటికి రాకపోవడంతో.. అసలు విషయాన్ని స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇచ్చారు. అరగంటసేపు శ్రమించి అతికష్టం మీద చాకచక్యంగా స్నేక్ క్యాచర్ మూర్తి పామును పట్టుకున్నాడు. పట్టుకున్న పామును అటవీ ప్రాంతంలోకి వదిలేయడంతో స్థానికులతో పాటు.. వాహనదారుడు కూడా ఊపిరి పీల్చుకున్నాడు. పామును బయటికి తీసారు కదా.. ఇక బయలుదేరి వెళ్దాం అనుకున్న వాహనదారుడికి అసలు ట్విస్ట్ కనిపించింది. ఆ పాము ఎటు వెళ్ళాలో తెలియక బైక్‌లోకి దూరలేదు. గత కొన్ని రోజులుగా ఆ స్కూటీ డిక్కీలోనే తలదాచుకుంది. పామును పట్టుకొని అటవీ ప్రాంతంలోకి వదిలేసిన తర్వాత స్కూటీ డిక్కీలో పాము గుడ్లు కనిపించడంతో వాహనదారుడు మరింత షాక్‌కు గురయ్యాడు. పాము తన స్కూటీ డిక్కీలో సంసారం పెట్టిన సంగతి కూడా తెలుసుకోలేకపోయాడు అనుకున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..