అనకాపల్లి జిల్లాలో ఓ గ్రామం.. ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఉన్నారు. వంట చేసేందుకు కిచెన్ లోకి వెళ్లారు ఆ ఇంట్లో మహిళ. కిచెన్ సెల్ఫ్ కింద గ్యాస్ ఆన్ చేశారు. అక్కడ నుంచి వింత శబ్దం. గ్యాస్ లీక్ అవుట్ ఉందా అన్న ఆలోచనలో పడ్డారు. కుటుంబ సభ్యులను పిలిచారు. చెక్ చేసిన అలాంటిదేమీ లేదు. ఇంకా శబ్దం పెరుగుతోంది. సిలిండర్ కదిపి కాస్త తొంగి చూస్తే.. అమ్మో అంతా గుండెలు పట్టుకున్నారు.. ఒక్కసారిగా పరుగులు తీశారు.
అడవులు అంతరించి పోతున్నాయి. చెట్లు చేమలు తొలగిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే కీటకాలు పక్షులు జీవుల జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా అనకాపల్లి సాలాపువానిపాలెంలో ఓ కుటుంబం భయంతో పరుగులు తీసింది. సాలాపువానిపాలెంలో ఓ రైతు కుటుంబం నివాసముంటోంది. కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వారిలోంచి ఒకరు వంట చేసేందుకు కిచెన్ రూమ్ కి వెళ్లారు. స్టవ్ ను వెలిగించేందుకు గ్యాస్ ఓపెన్ చేశారు. ఏవో వింత శబ్దాలు వినిపించాయి. గ్యాస్ లీక్ అవుతుందా అని అనుమానం. కానీ వాసన రాలేదు. ఇంకా శబ్దాలు పెరుగుతున్నాయి. దీంతో మిగిలిన కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఇంకా శబ్దాలు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పక్కనుంచే ఆ శబ్దాలు వస్తున్నట్లు అనిపించింది.
దీంతో ఆ గ్యాస్ సిలిండర్ను పక్కకు తప్పించి చూసే ప్రయత్నం చేశారు. ఇక.. అక్కడ ఓ నాగపాము తిష్ట వేసుకుంది. చేయి పెడితే కాటు వేసెలా ఉంది. కోపంతో బుసలు కొడుతూ ఉంది. దాన్ని చూసిన వెంటనే భయంతో పరుగులు తీశారు ఆ కుటుంబ సభ్యులు. విశాఖలోని స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్. కిచెన్ లో గ్యాస్ సిలిండర్ మాటున దాగి ఉన్న నాగుపామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంటి కి సమీపంలో ఉన్న చెట్ల పొదల నుంచి పాము ఇంట్లోకి వచ్చినట్టు గుర్తించారు. దాదాపుగా నాలుగున్నర అడుగుల పైగా ఆ నాగుపాము ఉంది. పట్టుకున్న తర్వాత కూడా బుసలు కొడుతూనే ఉంది. సేఫ్ గా పట్టుకొని భుసలు కొట్టే ఆ నాగు పామును బంధించి… అడవుల్లో ఆ పామును విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.