AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: స్కూల్‌‌కి వచ్చిన నాగరాజు.. ఈ పిల్లలు చూడండి ఏం చేశారో..

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెం పాఠశాల వంటగదిలో త్రాచుపాము కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు. పాములు కనిపిస్తే భయపడకుండా, అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Andhra: స్కూల్‌‌కి వచ్చిన నాగరాజు.. ఈ పిల్లలు చూడండి ఏం చేశారో..
Snake At School
Fairoz Baig
| Edited By: |

Updated on: Mar 24, 2026 | 12:24 PM

Share

ఏపీలోని మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెంలోని మండల పరిషత్ పాఠశాలలో త్రాచుపాము ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుకానీ వంట గదిలో తచ్చాడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా అదిరిపడ్డ వంట మనుషులు.. ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్నేక్‌ క్యాచర్‌ మల్లికార్జునను పిలిపించారు. స్కూల్లో పామును చూసి విద్యార్దులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాము ఉన్న చోటకు విద్యార్ధులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరిణామంతో కొద్దిసేపు వంటగదిలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం ఇవ్వడంతో స్కూలుకు చేరుకుని పామును పట్టుకున్నాడు. ఈ సందర్భంగా పాములు కనిపిస్తే భయపడవద్దని, వాటికి హాని కలిగించకుండా ఉంటే వాటి దారిన అవే వెళ్ళిపోతాయని స్నేక్‌ క్యాచర్‌ విద్యార్ధులకు సూచించారు. ఒకవేళ ఒకే చోట పాము కదలకుండా మకాం వేస్తే వెంటనే స్నేక్ క్యాచర్స్ లేదా అటవీ సిబ్బందికి సమాచారం అందిచాలని సూచించారు. పాములు పర్యావరణానికి మేలు చేసే సరీసృపాలు కావడం వల్ల వాటిని చంపకూడదని, విషపూరితమై పాములను పట్టుకుని అడవిలో వదిలివేయాల్సి ఉంటుదని వివరించారు… ఎట్టకేలకు పామును పట్టుకుని అడవిలో వదిలేయడంతో ఉపాధ్యాయులు, విద్యార్దులు ఊపిరి పీల్చుకున్నారు.. కొంతమంది విద్యార్ధులు పామును చూసి దండం పెట్టుకోవడం విశేషం.

Also Read: రూ.2 లతో ఎండిపోయే కరివేపాకు మొక్క పచ్చగా, గుబురుగా మారుతుంది..

Follow Us