Andhra Pradesh: పామును పట్టే వరకు ఓకే.. ఆడించడమే శాపమైంది.. కాటుకు స్నేక్ క్యాచర్ బలి

అతని పేరు పౌరుష్‌ రెడ్డి.. ఎలాంటి విష సర్పానైన్నా ఒంటి చేత్తో ఇట్టే పట్టేస్తాడు. ఎవరి ఇంట్లోకి పాము దూరినా పౌరుష్‌ రెడ్డికే ఫోన్‌ చేస్తారు. ఇంట్లోకి దూరిన పామును పట్టుకొని క్షేమంగా అడవిలోకి వదిలేస్తాడు. అయితే పాము పట్టడమే అతని పాలిట శాపంగా మారింది. ఇన్ని రోజులు వందల పాములను పట్టి ప్రజలను రక్షించిన ప్రముఖ స్నేక్ క్యాచర్ పౌరుష్ రెడ్డి అదే పాము కాటుకు గురై మృతిచెందారు...

Andhra Pradesh: పామును పట్టే వరకు ఓకే.. ఆడించడమే శాపమైంది.. కాటుకు స్నేక్ క్యాచర్ బలి
Snake Catcher Died

Updated on: May 18, 2023 | 6:36 PM

అతని పేరు పౌరుష్‌ రెడ్డి.. ఎలాంటి విష సర్పానైన్నా ఒంటి చేత్తో ఇట్టే పట్టేస్తాడు. ఎవరి ఇంట్లోకి పాము దూరినా పౌరుష్‌ రెడ్డికే ఫోన్‌ చేస్తారు. ఇంట్లోకి దూరిన పామును పట్టుకొని క్షేమంగా అడవిలోకి వదిలేస్తాడు. అయితే పాము పట్టడమే అతని పాలిట శాపంగా మారింది. ఇన్ని రోజులు వందల పాములను పట్టి ప్రజలను రక్షించిన ప్రముఖ స్నేక్ క్యాచర్ పౌరుష్ రెడ్డి అదే పాము కాటుకు గురై మృతిచెందారు.

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో సుపరిచి తుడైన స్నేక్ క్యాచర్ పౌరుష్ రెడ్డి మృతి చెందాడు గత రెండు రోజుల క్రితం పామును పట్టుకునే ప్రయత్నంలో భాగంగా పౌరుష్ రెడ్డి పాము కాటుకు గురైయ్యాడు.. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పౌరుష్‌ రెడ్డి పాములను పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి వాటిని తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తుంటాడు.

ఈ క్రమంలోనే సోమవారం రాత్రి జనశక్తి నగర్‌లో ఓ ఇంట్లోకి విషం సర్పం దూరింది. ఈ విషయం తెలుసుకున్న పౌరుష్‌ రెడ్డి ఆ ఇంటికి చేరుకున్నాడు. పామును పట్టుకున్న తర్వాత దానిని ఆడించాడు. కొంచెం ఆదమరిచిన సమయంలో పాము ఒక్కసారిగా పౌరుష్‌ రెడ్డి ఎడమ చేయిపై కాటేసింది. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన పౌరుష్‌ రెడ్డిని…కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..