Chandrababu Arrest: బిగ్ డే.. చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై తీర్పును వెలువరించనున్న ఏసీబీ కోర్టు.. ఏం జరగనుంది..

|

Sep 21, 2023 | 7:05 AM

Chandrababu Naidu Arrest: స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఐడీ కస్టడీకి కోర్ట్ అనుమతిస్తుందా.. లేదా..? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్.. ఇవాళ ఏం జరగనుంది.. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుంది..? అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఇవాళ ఏసీబీ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.

Chandrababu Arrest: బిగ్ డే.. చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై తీర్పును వెలువరించనున్న ఏసీబీ కోర్టు.. ఏం జరగనుంది..
Chandrababu Naidu Arrest
Follow us on

Chandrababu Naidu Arrest: స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఐడీ కస్టడీకి కోర్ట్ అనుమతిస్తుందా.. లేదా..? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్.. ఇవాళ ఏం జరగనుంది.. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుంది..? అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఇవాళ ఏసీబీ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఉదయం 11 గంటలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును ఇవ్వనున్నారు. నిన్న వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆర్డర్‌ను ఇవ్వాల్టికి వాయిదా వేశారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై.. ఏసీబీ కోర్ట్‌లో బుధవారం వాడీవేడీగా మూడు గంటలపాటు వాదనలు కొనసాగాయి. కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ.. అంత అవసరం లేదని లూథ్రా.. న్యాయమూర్తి ఎదుట సుదీర్ఘంగా బలమైన వాదనలు వినిపించారు. దీనిపై ఇవాళ ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఆసక్తి రేపుతోంది. కస్టడీ తీర్పు ఎలా ఉండనుంది.. అనేది ఉత్కంఠ రేపుతోంది.

విజయవాడ ఏసీబీ కోర్ట్‌లో.. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి – సిద్దార్ధ లూథ్రా మధ్య పోటాపోటీ వాదనలు జరిగాయి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని.. ఆయన అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు లూథ్రా. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడమే కాకుండా కస్టడీకి కోరడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగిందని.. ఏసీబీ విచారణలో కొత్త కోణం ఇప్పటిదాకా ప్రవేశ పెట్టలేక పోయారని లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. పీసీ యాక్ట్‌ 17ఏ అమెండ్‌మెంట్‌ కంటే ముందే కేసు నమోదు అయిందని.. అసలు 17ఏ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. దీనికి కొంత సమయం తీసుకున్నారు లూథ్రా.

మరింత లోతుగా విచారించాల్సిన అవసరం

చంద్రబాబును కస్టడీకి కోరుతూ ఏఏజీ పొన్నవోలు కూడా బలంగానే వాదనలు వినిపించారు. ఆన్ని ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని.. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కర్నీ మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడమే అసలు ఉద్దేశమన్నారు. చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏఏజీ వాదనలు వినిపించారు.

పీటీ వారెంట్లపై ఒత్తిడి సరికాదన్న న్యాయమూర్తి

ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్ట్‌.. కస్టడీ పిటిషన్‌పై తీర్పును గురువారానికి వాయిదా వేసింది. అంతకుముందు పీటీ వారెంట్ల పిటిషన్లకు సంబంధించి ఒకేసారి విచారించాలని ఒత్తిడి తీసుకురావొద్దని ఏసీబీ కోర్ట్ స్పష్టం చేసింది. మరోవైపు అంగళ్లు కేసులో ఏపీ హైకోర్ట్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు చంద్రబాబు. ఈ కేసులో ఓ1గా ఉన్నారు చంద్రబాబు. ఈ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

12 రోజులుగా జైల్లోనే..

కాగా.. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు తర్వాత సీఐడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించగా.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గురువారంతో 12 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..