Andhra: పాడుబడిన సొరంగం నుంచి అలికిడి.. వెళ్లి తొంగి చూడగా.. బాబోయ్..

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముసిడివాడలో ఒకేసారి ఆరు భారీ కొండచిలువలు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్నేక్ క్యాచర్ నాగరాజు నాలుగు పాములను సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టగా, మరో రెండు పాములు గాయాలతో మృతి చెందినట్లు తెలిపారు. ..

Edited By:

Updated on: Mar 13, 2026 | 11:14 AM

పాము పేరు వింటేనే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది.. మరి కొంతమంది అయితే ఎక్కడైనా ఒక పాము కనిపిస్తే పరుగులు పెట్టే పరిస్థితి. అలాంటి ఒకే చోట కుప్పలు తెప్పలుగా పాములు ఉంటే.. అవి కూడా భారీ కాయంతో పొడవైన కొండచిలువలు కనిపిస్తే..?! ఎస్.. చదవడానికే భయంగా ఉంటే.. డైరెక్ట్ గా వాటిని చూసే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఎదురయింది అనకాపల్లి జిల్లాలో…

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముసిడివాడలో భారీ కొండ చిలువలు కనిపించాయి. ఒకే చోట.. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా ఆరు కొండచిలువలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఇంటి వెనుక గతంలో పక్కన పెట్టిన భారీ పైపు లైన్ ఉంది. ఆ వెనుకే వాకింగ్ కోసం పొదలు తొలగించి చదును చేస్తున్నారు. ఈ క్రమంలో గత రాత్రి.. పాడుబడిన పైపు నుంచి ఓ భారీ కొండచిలువ రావడాన్ని కొందరు గమనించారు. దాన్ని చూసి భయాందోళనకు గురైన స్థానికులు స్నేక్ క్యాచరు నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నాగరాజు.. రెండు భారీ కొండచిలువలను రెస్క్యూ చేశాడు. పాడుబడిన పైపులో తొంగి చూస్తే.. మరో నాలుగు కొండలు కనిపించాయి. తీవ్రంగా శ్రమించి ఎలాగోలా మరో రెండు కొండచిలువలను చాక చక్యంగా పట్టుకున్నారు. వాటిని కూడా పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పక్కనే ఉన్న ప్రోక్లైనర్‌తో.. మట్టిని తవ్వి లోపల ఉన్న పాములను బయటకు రప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రాక్లేయినర్ తగిలి రెండు పాములకు గాయలై మృతి చెందినట్లు స్నేక్ క్యాచర్ నాగరాజు తెలిపాడు. సేఫ్‌గా రెస్క్యు చేసిన నాలుగు భారీ కొండ చిలువలను సమీపంలోని అడవుల్లో విడిచిపెట్టామని అన్నారు. పక్కనే ఉన్న పొదలను చదును చేస్తున్న క్రమంలో.. కొండ చిలువలు అక్కడ నుంచి పాడుబడిన పైప్ లైన్‌లోకి వచ్చి చేరి ఉంటాయని నాగరాజు అనుమానం వ్యక్తం చేశాడు.

Also Read:  గొంతులో ఇరుక్కుపోయిన బతికున్న చేప.. ఆ తర్వాత ఏమైందంటే..? 

 

Follow Us