Andhra Pradesh: ట్రాక్టర్‌లో వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. ఏడుగురు దుర్మరణం.. 20 మందికి..

Guntur News: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి  తీవ్రగాయాలయ్యాయి.

Andhra Pradesh: ట్రాక్టర్‌లో వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. ఏడుగురు దుర్మరణం.. 20 మందికి..
Road Accident

Updated on: Jun 05, 2023 | 4:49 PM

Guntur News: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి  తీవ్రగాయాలయ్యాయి. పంక్షన్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు మార్గ మధ్యలో.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఘటన జరిగిన సమయంలో మొత్తం 30 మంది ట్రాక్టర్‌లో ఉన్నట్లు పేర్కొంటున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. బాధితులు కొండేపాడు వాసులుగా గుర్తించారు. పంక్షన్ కోసం జూపూడి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..