తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అల్లర్లపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మే 18 రాత్రి తాడిపత్రికి చేరుకున్న సిట్ బృందం అర్థరాత్రి వరకు విచారణ కొనసాగించింది. పోలింగ్ రోజు మొదట ఓం శాంతి నగర్‎లో రాళ్లదాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు సిట్ అధికారులు.

తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
Sit Officers

Updated on: May 19, 2024 | 8:23 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అల్లర్లపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మే 18 రాత్రి తాడిపత్రికి చేరుకున్న సిట్ బృందం అర్థరాత్రి వరకు విచారణ కొనసాగించింది. పోలింగ్ రోజు మొదట ఓం శాంతి నగర్‎లో రాళ్లదాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు సిట్ అధికారులు. పోలింగ్ మరుసటి రోజు 14వ తేదీన టిడిపి నాయకుడు సూర్యముని ఇంటిపై రాళ్లదాడి జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర తాడిపత్రిలోని అన్ని ప్రాంతాలను సందర్శించి రిపోర్టును రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎదురుగా ఉన్న జూనియర్ కాలేజీ గ్రౌండ్‎నుకూడా జల్లడపట్టారు. రాళ్ల దాడి జరిగిన ప్రాంతాలన్నింటినీ సీక్వెల్‎గా పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు సిట్ అధికారులు.

మే 19న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిని, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూడా దర్యాప్తులో భాగంగా సిట్ బృందం పరిశీలించనుంది. రాళ్లదాడి అనంతరం.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై పోలీసులు జరిపిన దాడులను, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సృష్టించిన విధ్వంసంపై కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై రిపోర్టు తయారు చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించనుంది. ఇప్పటికే తాడిపత్రిలో అల్లర్లు, రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి చాలామందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు కేసు నమోదు చేసిన వారిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో అడిగి తెలుసుకుని వాటిని కూడా నివేదికలో పొందుపరచనున్నారు సిట్ అధికారులు. సిట్ అధికారుల పర్యటనతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాత కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..