Andhra Pradesh: వెలుగులోకి 18 ఏళ్ల రహస్య బంధం.? సినిమాను తలపించేలా మేకపాటి కుటుంబ కథా చిత్రమ్‌.

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి కుటుంబంలో ఒక్కసారిగా కలకలం రేగింది. తాను చంద్రశేఖర్‌ రెడ్డి కుమారుడిని అంటూ మేకపాటి శివచరన్‌ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 18 ఏళ్లు రహస్యంగా ఉంచి మమ్మల్ని విడిచిపెట్టారంటూ మేకపాటి శివచరణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి...

Andhra Pradesh: వెలుగులోకి 18 ఏళ్ల రహస్య బంధం.? సినిమాను తలపించేలా మేకపాటి కుటుంబ కథా చిత్రమ్‌.
Mekapati Siva Charan Reddy

Updated on: Jan 07, 2023 | 2:56 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి కుటుంబంలో ఒక్కసారిగా కలకలం రేగింది. తాను చంద్రశేఖర్‌ రెడ్డి కుమారుడిని అంటూ మేకపాటి శివచరన్‌ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 18 ఏళ్లు రహస్యంగా ఉంచి మమ్మల్ని విడిచిపెట్టారంటూ మేకపాటి శివచరణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తనకు కుమారుడు లేడంటూ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రకటనకు కౌంటర్‌గా శివ చరణ్‌ రెడ్డి ఈ లేఖను విడుదల చేశారు. లేఖతో పాటు చిన్ననాటి ఫొటోలను కొన్ని విడుదల చేశారు.

ఇంతకీ లేఖలో ఏముందంటే..

నా జీవితంలో అన్ని ముఖ్యమైన సంఘటనల్లో మిమ్మల్ని మిస్‌ అయ్యాను, నాకు జన్మనివ్వమని నేను మిమ్మల్ని అడగలేదు. నేను మీ బాధ్యత. 14 ఏళ్ల వయసులో మీరు మమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత నేను మీ హృదయంలో నా స్థానాన్ని అర్థం చేసుకున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నా చదువుకు ఫీజులు చెల్లించినందుకు ధన్యవాదాలు. తండ్రి బాధ్య అక్కడతో ముగియదు. మీరు నా తల్లి గారితో 18 ఏళ్లు కలిసి జీవించి విడిచిపెట్టారు. మీరు మమ్మల్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచారు. మీ సంపద లేదా రాజకీయ వారసత్వం వెనక నేను లేను. దయచేసి నన్ను మీ కుమారుడిగా గుర్తించండి, ఇది మీరు పూర్తిగా చేయగలిగింది. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చానంటే ఒక ఇంటర్వ్యూలో మీకు మగ పిల్లలు లేరన్నారు. మరి నేనవరి.? నేను మీ కొడుకుని. నన్ను, నా బాధను గుర్తించండి అంటూ లేఖలో రాసుకొచ్చారు. దీంతో ఈ లేఖలో ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇదిలా ఉంటే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. శివ చరణ్‌ రెడ్డి విడుదల చేసిన లేఖ, ఫొటోలపై చంద్ర శేఖర్‌ రెడ్డి ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ వివాదానికి ఆయన ఎలా ఫుల్‌స్టాప్‌ పెడతాడన్నదానిపై సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..