నేలమీది విమానం… వేల కిలోమీటర్ల వేగం… రయ్‌ని దూసుకెళ్లే బుల్లెట్ ట్రెయిన్… ఇది మన దేశానికి ఎప్పుడొస్తుందో తెలీదు. కానీ… దాదాపు బుల్లెట్ ట్రెయిన్ లాంటిదే అనే ప్రచారంతో ఇటీవలే దర్జాగా పట్టాలెక్కింది వందేభారత్ రైలు. దేశంలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ – విశాఖ మధ్య వందే భారత్ ట్రైన్ పరుగులు పెడుతోంది. ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చాక.. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాళ్లకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ ట్రైన్‌లో కేవలం 8 గంటల 40 నిముషాల్లోనే విశాఖ చేరుకుంటారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే… సికింద్రాబాద్- తిరుపతి అతి త్వరలో ట్రాక్‌పైకి రానుంది. ప్రజంట్ రూట్‌పై కసరత్తు చేస్తున్నారు. మొత్తం 3 ఆప్షన్స్ పరిశీలనలో ఉన్నారు. ఒకటి బీబీనగర్, నడికుడి, మిర్యాలగూడ మీదుగా, ఇంకొకటి వరంగల్, ఖాజీపేట, కడప మీదుగా.. మరొకటి బీబీనగర్ నుంచి గుంటూరు, నెల్లూరు, గూడూరు.. ఇలా మూడు మార్గాలపై అన్వేషణ సాగుతుంది.
అలానే… పిడుగురాళ్ల జంక్షన్ నుంచి శావల్యపురం మీదుగా ఒంగోల్, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మార్గంపై కూడా అధికారులు సమాలోచనలు చేశారు. వీటన్నింటిపై కూలంకషంగా చర్చించి.. తక్కువ డిస్టెన్స్.. ఉన్న మార్గాన్ని ఫైనలైజ్ చేయనున్నారు. గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ట్రాక్‌ల సమర్థత, బ్రిడ్జి నిర్మాణ తనిఖీ అనంతరం అఫీషియల్ ప్రకటన రానుంది.
GST, తత్కాల్ సర్‌ఛార్జితో కలిపి.. ఈ ట్రైన్ టికెట్ ధర రూ.1150 నుంచి స్టార్టవ్వనుంది. టికెట్ ఛార్జి, రైలు నంబర్లు ఫైనల్ కాగానే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్ చేస్తారు. ప్రజంట్ తిరుపతి- సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 12 గంటలు పడుతుండగా.. వందేభారత్ రైలు ప్రయాణం ఆరున్నర నుంచి 7 గంటలు పడుతుందని అధికారుల చెబుతున్నారు. ఫిబ్రవరి మంత్ ఎండ్ లోపు ఈ ట్రైన్ అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..