AP municipal elections: ఏపీ మున్సిపల్‌ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కీలక నిర్ణయం

ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం విడుదల చేసింది. గతంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు చనిపోయిన చోట్ల మళ్లీ నామినేషన్లు..

AP municipal elections: ఏపీ మున్సిపల్‌ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కీలక నిర్ణయం
SEC Nimmagadda Ramesh Kumar

Updated on: Feb 20, 2021 | 11:00 PM

AP municipal elections: ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం విడుదల చేసింది. గతంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు చనిపోయిన చోట్ల మళ్లీ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు చనిపోయిన చోట ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

దీనిలో భాగంగా ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. మార్చి 3వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులుండవని, యథాతథంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

గతంలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత నామినేషన్లు దాఖలు చేసిన గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన 56 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. వారిలో 28 మంది వైసీపీ అభ్యర్థులు, టీడీపీ-17, బీజేపీ- 5, సీపీఐ- 3, కాంగ్రెస్-2, జనసేనకు చెందిన ఒకరు నామినేషన్‌ అనంతరం వేర్వేరు కారణాలతో మృత్యువాతపడ్డారు. ఈ స్థానాలన్నింటిలో నామినేషన్‌ వేసేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఇదిలావుంటే మున్సిపల్‌ ఎన్నికలపై ఈ నెల 22న తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంకు అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సీఎస్‌ నిమ్మగడ్డ రమేశ్ ఆదేశాలు జారీ చేశారు.

Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..