ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వం.. చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేదన్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్ర ముగిసింది. శనివారం ఐదు నియోజకవర్గాల..

ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వం.. చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేదన్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
Follow us
K Sammaiah

|

Updated on: Feb 20, 2021 | 11:19 PM

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్ర ముగిసింది. శనివారం ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర ఆయన పాదయాత్ర చేపట్టారు. గాజువాక చేరుకున్న విజయసాయిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటు నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని విమర్శించారు. తన పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాతిక కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అనేక త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు అని తెలిపారు. ప్రైవేటీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని, పరిశ్రమ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

పోస్కో సంస్థ ప్రతినిధులు సీఎం జగన్ ను కలిస్తే, విశాఖలో తప్ప మరెక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారని విజయసాయి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.25 వేల కోట్ల మేర రుణభారం ఉందని, ఆ రుణాలను ఈక్విటీలోకి మార్చడమే కాకుండా, ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయిస్తే మళ్లీ లాభాల బాట పడుతుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్న అధికారులు మన రాష్ట్రానికి చెందినవారు కాదని, వాళ్లే కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విజయసాయి ఆరోపించారు.

Read more:

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల అభిమానులతో షర్మిల భేటీ.. ఏయే అంశాలు చర్చించారంటే..