Prakasam District: పైనుంచి చూస్తే పత్తి చేనే అనుకుంటారు… లోపలకు దిగి చెక్ చేసిన అధికారులు షాక్

|

Oct 22, 2021 | 10:47 AM

బేస్తవారిపేట మండలంలోని చెన్నుపల్లికి చెందిన లక్కమనేని చెంచమ్మ అనే మహిళా రైతు సమీప పొలాల్లో పత్తి సాగు చేస్తున్నారు.

Prakasam District: పైనుంచి చూస్తే పత్తి చేనే అనుకుంటారు... లోపలకు దిగి చెక్ చేసిన అధికారులు షాక్
Ganja Cultivation
Follow us on

గంజాయి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చ లేపుతుండగా.. తెలంగాణలో కూడా పలు డ్రగ్స్ లింకులు తెరపైకి వస్తున్నాయి. దీంతో సీఎంలు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. తాజాగా ప్రకాశం జిల్లాలో గంజాయి కలకలం చెలరేగింది. ఎస్‌ఈబీ  అధికారుల దాడుల్లో షాకింగ్ దృశ్యం వెలుగుచూసింది. పత్తి చేను మాటున గుట్టుగా చేస్తున్న గంజాయి సాగు వ్యవహారం వెలుగుచూసింది. ఊహించని విధంగా పత్తి చేలో గంజాయి సాగు స్థానికులను షాక్‌కు గురిచేసింది. గంజాయి సాగు చేస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులకు పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. చెంచమ్మ అనే మహిళ గ్రామ శివారుల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు.

బేస్తవారిపేట మండలంలోని చెన్నుపల్లికి చెందిన లక్కమనేని చెంచమ్మ అనే మహిళా రైతు తన పొలంలో పత్తి సాగు చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎవరూ గుర్తించకుండా ఉండేలా అందులో… అక్కడక్కడ గంజాయి మొక్కలు కూడా నాటారు. విశ్వసనీయ వర్గాల నుంచి.. సమాచారం రావడంతో ఎస్‌ఈబీ అధికారులు గురువారం దాడి చేశారు. చెంచమ్మ పొలంలో నాటిన 310 గంజాయి మొక్కలను గుర్తించి పీకి వేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆమెకు ఎవరెవరితో లింకులు ఉన్నాయో కూపీ లాగుతున్నారు. అసలు ఇలా గంజాయి సాగు చెయ్యమని ఎవరు చెప్పారు. గతంలో ఎన్నిసార్లు ఇలా చేశారు అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు. సాగు చేసిన గంజాయిని ఎవరికి సప్లై చేస్తున్నారనే విషయంపై ఫోకప్ పెట్టారు. గంజాయి. సాగు నేరమని.. ఒకవేళ ఎవరైనా సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని సెబ్ అధికారులు హెచ్చరించారు.

Also Read:Telangana: ‘అయ్యో పాపం’ అని లిఫ్ట్ ఇస్తే.. చుక్కలు చూపించారు

 ప్రేమను నిరాకరించిన యువతికి యువకుడి గిఫ్ట్… అందులో ఏముందో తెలిస్తే మైండ్ బ్లాంక్