Antarvedi Sea: అంతర్వేదిలో భయం భయం.. పౌర్ణమికి పోటెత్తిన సముద్రం.. జనావాసాల్లోకి నీరు

అంతర్వేది వద్ద తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో సముద్రుడు ఉగ్ర రూపం దాల్చింది. వంద కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది.

Antarvedi Sea: అంతర్వేదిలో భయం భయం.. పౌర్ణమికి పోటెత్తిన సముద్రం.. జనావాసాల్లోకి నీరు
Sea Water Rushing At Antarv

Updated on: May 17, 2022 | 9:23 AM

Antarvedi: కోనసీమ జిల్లా జిల్లా(Konaseema District) సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం పోటెత్తింది. ఓ వైపు తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతుండడం.. మరోవైపు వైశాఖ పౌర్ణమి(Vaisakha Pournami) కావడంతో అంతర్వేది వద్ద తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో సముద్రుడు ఉగ్ర రూపం దాల్చింది. వంద కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. దీంతో సముద్రం నీరు రోడ్లపైకి, గ్రామం లోనికి చొచ్చుకు వచ్చింది. సముద్రం ఉప్పొంగడంతో తీర ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అంతర్వేది పల్లిపాలెంలో ఇళ్లు నీటమునిగాయి.

తీరప్రాంతం కోతకు గురవడంతో.. సరుగుడు, కొబ్బరి చెట్లు సముద్ర గర్భంలో కలసి తీవ్రంగా నష్టపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. అంతేకాదు  గతంలో పలు సందర్భాల్లో సముద్రం ఆటుపోట్లకు గురైనప్పటికీ గ్రామంలో ఇళ్లు మునిగిన పరిస్థితి లేదని గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

 

Also Read: KGF OTT: అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన కేజీఎఫ్‌ 2.. కానీ షరతులు వర్తిస్తాయి.. అవేంటంటే..

Tirumala: శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న బోండా.. సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు

Hanuman: వానరరూపంలో ఉన్న హనుమంతుడికి ఒంటె వాహనం.. పురాణాల్లో ఆసక్తికరమైన కథనం ఏమిటంటే..