Andhra Pradesh: ఆరు నెలలకే స్కూల్ హెడ్‌మాస్టర్ బదిలీ.. ఆ పిల్లల వేదన అంతా ఇంతా కాదు..

|

Sep 25, 2021 | 9:47 AM

Andhra Pradesh: ఇన్నాళ్లూ చదువు చెప్పి.. మంచి నడవడికలు నేర్పించిన గురువు బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు పడ్డ ఆవేదన అందరినీ కదిలించింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని..

Andhra Pradesh: ఆరు నెలలకే స్కూల్ హెడ్‌మాస్టర్ బదిలీ.. ఆ పిల్లల వేదన అంతా ఇంతా కాదు..
Bheemuni Palle
Follow us on

Andhra Pradesh: ఇన్నాళ్లూ చదువు చెప్పి.. మంచి నడవడికలు నేర్పించిన గురువు బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు పడ్డ ఆవేదన అందరినీ కదిలించింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని ఏపీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది ఈ భావోద్వేగ ఘటన. మా ప్రిన్సిపాల్‌ సర్ రఘునాథ్‌ను బదిలీ చేయొద్దంటూ ఆ విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. రఘునాథ్ ఇక్కడ విధుల్లో చేరి కేవలం 6 నెలలు మాత్రమే అయ్యిందట. ఇంతతక్కువ కాలంలోనే అనేక సంస్కరణలకు బీజం వేసి, మంచి ఫలితాలు తీసుకొచ్చారు ఆయన. ప్రతి విద్యార్థినితో ప్రత్యేక అనుబంధం పెంచుకున్నారు. విద్యార్థులు, సిబ్బంది మనసులో చెరగని ముద్రవేశారు.

ఈ క్రమంలో ప్రభుత్వం రఘునాథ్‌‌ని‌ బదిలీ చేసింది. తమ పాఠశాల నుంచి ఆయన వెళ్లిపోతున్నారని తెలుసుకున్న విద్యార్థినులు మనోవేదనకు గురయ్యారు. తమ ప్రిన్సిపాల్ ఎలాగైనా అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. తమ తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో నినాదాలు చేస్తూ.. బదిలీని ఆపాలని డిమాండ్ చేశారు. ఓ టీచర్‌ కోసం ఇలా ఊరు ఊరే కదిలిరావటం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Also read:

పీవీ సింధుతో తలపడ్డ దీపికా పదుకొనే..! కేలరీలు కరిగించేందుకే అంటూ ఫోటోలను షేర్‌ చేసిన దీపిక.. వీడియో

Prabhas: బుల్లితెరపై సందడి చేయనున్న ప్రభాస్‌.. ఫాన్స్‌కి పండగే.. వీడియో

Kolkata Traffic Police: మీరు సూపర్ సార్.. ట్రాఫిక్ పోలీసుపై నెటిజన్ల ప్రశంసల వెల్లువ.. వీడియో