Andhra News: మద్యం మత్తులో భార్యను నరికి చంపిన భర్త.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన కూతురు!

సత్య సాయి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యానికి బానిసైన ఒక వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను కొడవలితో అతి కిరాతకంగా హత్య చేశాడు. కూతురి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరించారు.

Andhra News: మద్యం మత్తులో భార్యను నరికి చంపిన భర్త.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన కూతురు!
Crime

Edited By:

Updated on: Sep 11, 2025 | 11:18 PM

శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రానికి చెందిన రాఘవేంద్ర లక్ష్మీదేవి దంపతులకు శృతి అనే కూతురు ఉంది. ఏ పని పాట లేకుండా జులైగా తిరిగే రాఘవేంద్ర మద్యానికి బానిసై కుటుంబాన్ని గాలికి వదిలేసాడు. దీంతో కుటుంబ పోషణ కోసం భార్య లక్ష్మీదేవి కూలి పనులకు వెళ్ళేది. అలా కూలి డబ్బులతో వచ్చిన సంపాదనతోనే ఆ కుటుంబాన్ని లక్ష్మీదేవి నెట్టుకొస్తుంది. ఇలా రోజు తాగొస్తున్న భర్త రాఘవేంద్రతో భార్య లక్ష్మీదేవి గొడవపడేది. ఇంట్లో ఈడొచ్చిన కూతురు ఉందని ఎంత నచ్చ చెప్పిన భర్త రాఘవేంద్ర వినలేదు. అయితే భర్త రాఘవేంద్ర మందు తాగడానికి ఎప్పుడు డబ్బులు కావాలన్నా భార్య లక్ష్మీదేవితో గొడవపడి డబ్బులు తీసుకుని వెళ్లి ఫుల్లుగా మందు కొట్టొచ్చేవాడు. ఆ తర్వాత భార్యను కొట్టేవాడు.

అలాగే ఓ రోజు మద్యం తాగడానికి డబ్బులు కావాలని రాఘవేంద్ర భార్య లక్ష్మీదేవితో గొడవపడ్డాడు. తన దగ్గర డబ్బులు లేవని లక్ష్మీదేవి ఖరాఖండీగా చెప్పేసి కూలి పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన భార్య వంట చేద్దామని వంటిల్లోకి వెళ్లగా అక్కడ బియ్యం బస్తా కనిపించలేదు. దీంతో అప్పుడే ఫుల్‌గా తాగేసి వచ్చిన భర్తను భర్తను ఆమె నిలదీసింది. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో… బియ్యం బస్తాలు అమ్మి… ఆ డబ్బులతో ఫుల్లుగా మందు తాగి వచ్చినట్లు భర్త రాఘవేంద్ర భార్య లక్ష్మీదేవికి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

తిండి గింజలు అమ్మి మందు తాగి వస్తావా అని భార్య లక్ష్మీదేవి భర్త రాఘవేంద్రపై అరచింది. భార్యాభర్తల మధ్య గొడవ పడడాన్ని చూసిన కూతురు శృతి బంధువుల ఇంటికి వెళ్ళింది. కూతురు ముందు తనతో గొడవ పడిందని భార్యపై కోపం పెంచుకున్న భర్త అర్ధరాత్రి కొడవలితో భార్య లక్ష్మీదేవిని నరికి చంపాడు. ఉదయం ఇంటికి వచ్చిన కుమార్తె రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి షాక్ కు గురైంది. వెంటనే బంధువల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన తల్లిని తండ్రే హత్య చేసినట్లు కుమార్తె శృతి పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని తండ్రి రాఘవేంద్రను అరెస్టు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.