పందెం కోళ్లకు వైరస్ సోకింది. వేలు, లక్షలు విలువ చేసే పందెం కోళ్ళు గిలగిలా కొట్టుకుంటూ ఉన్నట్టుండి చనిపోతున్నాయి. వైరస్ సోకడంతో, అవి నిమిషాల వ్యవధిలో మృత్యువాత పడుతున్నాయి. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో వేలాది కోళ్లు వైరస్ వల్ల చనిపోతున్నాయి. ఏడాది నుంచి సంక్రాంతి పందేల కోసం ఎంతో కష్టపడి పెంచిన పందెం కోళ్ళు ఒక్కసారిగా చనిపోవడంతో పెంపకందారులు నిరాశ చెందుతున్నారు పెంపకం దారులు. ఆదాయం పోయి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటి నుంచి రక్తం కారటం, స్పృహ తప్పి పడిపోయిన కొద్ది క్షణాల్లోనే పందెం కోళ్లు మృత్యువాత పడుతుండడంతో, యజమానులకు స్పందించేందుకు సమయం కూడా దరొకడం లేదు. కొద్ది క్షణాలలో చనిపోతుఉడటంతో పెంపకం దారులు తీవ్రంగా నష్టపోతున్నారు
శీతాకాలంలో వస్తున్న మిక్స్‌డ్ వైరస్‌ల వల్లే పందెం కోళ్లు చనిపోతున్నాయని పశు సంవర్ధక శాఖ చెబుతోంది. గాలి నీరుతో పాటు ఇతర కోళ్లు, మనుషుల ద్వారా కూడా పందెం కోళ్లకు ఈ వైరస్ సోకుతోందంటున్నారు వాళ్లు. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే…పందెం కోళ్లను ఐసోలేషన్‌లో ఉంచాలని సజెస్ట్ చేస్తున్నారు వెటర్నరీ వైద్యులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి