Andhra: వారెవ్వా.. భలే పోటీలు భయ్యా.. అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఎడ్లపోటీలు, పొట్టేళ్ళ పోటీలకు దీటుగా సముద్రతీరంలో పడవ పోటీలు, ఈత పోటీలు నిర్వహించారు. కొత్తపట్నం మండలం మన్నూరు పెద్దపాలెం గ్రామంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా సముద్రంలో మత్స్యకారుల పడవల పోటీలు, ఈతల పోటీల్లో పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.

Andhra: వారెవ్వా.. భలే పోటీలు భయ్యా.. అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
Sea Boat Swimming Competitions

Edited By:

Updated on: Jan 14, 2026 | 1:56 PM

సంక్రాంతి పండుగ వచ్చిందంటే పల్లెల్లో సందది నెలకొంటుంది. ఘుమఘుమలాడే పిండివంటలతో పాటు పంట చేతికొచ్చిన దశలో చేసుకునే పొంగళ్ళు, విందు, వినోద కార్యక్రమాలతో పల్లెలు కొత్తరూపును సంతరించుకుంటాయి. అయితే భూమితో, పంటలతో సంబంధం లేని సముద్రంలో వేటతో జీవనం సాగించే మత్స్యకారులు వినూత్నంగా పడవ పోటీలు, ఈత పోటీలు నిర్వహిస్తూ సంక్రాంతి సంబరాలకు మరింత వన్నె తెస్తున్నారు. పల్లెల్లో ఎడ్లపోటీలు, పొట్టేళ్ళ పోటీలు, కోళ్ళ పందేలు జోరుగా సాగుతుంటే తమకు జీవనాధారమైన సముద్రంలో పడవ పోటీలు, ఈత పోటీలు నిర్వహిస్తూ మత్స్యకార సంఘాలు పండగను మరింత శోభాయమానంగా నిర్వహించుకుంటున్నారు.

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఎడ్లపోటీలు, పొట్టేళ్ళ పోటీలకు దీటుగా సముద్రతీరంలో పడవ పోటీలు, ఈత పోటీలు నిర్వహించారు. కొత్తపట్నం మండలం మన్నూరు పెద్దపాలెం గ్రామంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా సముద్రంలో మత్స్యకారుల పడవల పోటీలు, ఈతల పోటీల్లో పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.. సముద్రంలో కిలో మీటరు దూరంలో ఓ మరబోటును ఉంచారు.. తీరం నుంచి పడవలు ఆ బోటు వరకు వెళ్ళి తిరిగి వెనక్కి రావాలి.. ఎవరు ముందు వస్తే వారు గెలిచినట్టు… ఈ పడవల పోటీల్లో గెలిచిన వారికి మొదటి బహుమతికిగా 15 వేల రూపాయలు, రెండో బహుమతిగా 10 వేల రూపాయలు, మూడో బహుమతిగా 5 వేల రూపాయలు అందించారు.

వీడియో చూడండి..

అలాగే ఈత పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 5 వేల రూపాయలు, రెండో బహుమతిగా 3 వేల రూపాయలు, మడో బహుమతిగా 2 వేల రూపాయలు అందించారు. 2022లో తొలిసారి చీరాలలో ఆ తరువాత అనకాపల్లిజిల్లాలో, ఈ ఏడాది ప్రకాశంజిల్లా మన్నూరు గ్రామంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. మత్స్యకారుల జీవనాధారమైన సమద్రంలో ఈ పడవ పోటీలు నిర్వహించడం ద్వారా మత్స్యకారులకు వినోదం పంచేందుకు ఈ పడవ, ఈత పోటీలు నిర్వహిస్తున్నట్టు మత్యకార సంక్షేమ సమితి నాయకులు సున్నపు తిరుపతిరావు, రేవు చలపతి వర్మ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..