Pottelu Pandalu: బాపట్ల జిలాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు.. జోరుగా పొట్టేళ్ల పందాలు..

|

Jan 13, 2023 | 10:53 AM

కోడి పుంజుల్లానే ఈ గొర్రె పొట్టేళ్ళకి పౌరుషం ఎక్కువ. ఇవి ఢీ కొనడం మొదలు పెడితే తల నుంచి రక్తం ఏరులై పారినా లెక్కచేయవు. పందెం రాయుళ్ళు పొటేళ్ళకు పోటీల కోసం స్పెషల్ గా శిక్షణ ఇస్తారు.

Pottelu Pandalu: బాపట్ల జిలాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు.. జోరుగా పొట్టేళ్ల పందాలు..
Sheep Fighting Competition
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలను ముందస్తుగా నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో సంస్కృతీ, సంప్రదాయం ఉట్టిపడేలా చర్యలు తీసుకున్నారు. రంగవల్లులు, గంగిరెద్దు ఆటలు, కోడి పందాలు వంటి వాటితో పాటు.. బాపట్ల జిలాల్లో పొట్టేల పందాలను కూడా మొదలు పెట్టారు. జిల్లాలోని రేపల్లె మండలం పెనుమూడి గ్రామ శివారులో ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు, మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జునరావు కలిసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలలో భాగంగా పోటేల్ల పోటీలను ప్రారంభించారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.

మరోవైపు జిల్లాలోని పర్చూరు మండలం , అన్నంబొట్లవారిపాలెంలో ఎడ్ల బలప్రదర్శనలో భాగంగా పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. స్థానిక గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు జరిగాయి. సంక్రాంతి వేడుకలలో భాగంగా ప్రతి ఏడాది నిర్వహించే రాష్ట్ర స్థాయి పొట్టేళ్ళ పందేలు ఉత్సహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి 21 జతలు పొట్టేళ్లు పాల్గొన్నాయి . ప్రథమ స్థానంలో మార్టూరు (డెయిరీఫామ్) బుల్లోడు, ద్వితీయ స్తానం, కుందుర్తి మేకల మురళి, తృతీయస్థానం, శ్రీరామపురానికి చెందిన శ్రీనివాసరావు పొట్టేళ్లు గెల్చుకున్నాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. పొట్టేళ్ళ పందేలను తిలకించేందుకు గాను ప్రకాశం , బాపట్ల , గుంటూరు ,పల్నాడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు .

వాస్తవానికి ఈ పొట్టేళ్ళ పందాలు మన వినోద సంప్రదాయాలలో ఒకప్పుడు భాగంగా ఉండేవి. ఇప్పుడు ఈ జిల్లాలో సంక్రాంతి సందర్భంగా గత కొన్ని ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. కోడి పుంజుల్లానే ఈ గొర్రె పొట్టేళ్ళకి పౌరుషం ఎక్కువ. ఇవి ఢీ కొనడం మొదలు పెడితే తల నుంచి రక్తం ఏరులై పారినా లెక్కచేయవు. పందెం రాయుళ్ళు పొటేళ్ళకు పోటీల కోసం స్పెషల్ గా శిక్షణ ఇస్తారు. బలంగా మేపి పండుగకు పందాలలోకి దింపుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..