Sankranti Bonanza: పండగ వేళ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారందరి ఖాతాల్లో నిధుల జమ!

రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు పంగడ పూట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ తో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు కింద దాదాపురూ.2,600 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 5.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

Sankranti Bonanza: పండగ వేళ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారందరి ఖాతాల్లో నిధుల జమ!
Ap Employees Da Arrears Sankranti 2026

Updated on: Jan 15, 2026 | 8:53 AM

సంక్రాంతి పండగ రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రాబాబు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న డీఏ, (Dearness Allowance), డీఆర్ (Dearness Relief) తో పాటు కాంట్రాక్ట్‌ బిల్లులను క్లియర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఏకంగా రూ.2,600 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ డబ్బుతో ఉద్యోగుల డీఏ, డీఆర్ బకాయిల చెల్లించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత సుమారు 60 ఈ పెండింగ్ బకాయిలు రిలీజ్ అయ్యాయి. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5.7 లక్షల మంది ఉద్యోగుల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో సుమారు రూ.30 నుంచి రూ.60 వేల వరకు జమ నిధులు కానున్నాయి. లబ్దిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బంది సహా కొందరు కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు.

ఎవరికి ఎంతెంతం

ఇక తాజాగా ప్రభుత్వం విడుదల చేసి మొత్తం రూ.2,600 కోట్లలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సి డీఏ, డీఆర్‌ కోసం రూ.1,100 కోట్లు విడుదల చేయగా.. పోలీసు సిబ్బందికి రావాల్సిన సర్రెండర్ లీవ్ బకాయిల నిమిత్తం రూ. 110 కోట్లు కేటాయించారు. దీంతో పాటు ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (EAP), నాబార్డ్, SASCI, CRIF, చేపట్టిన పనుల కోసం రూ.1,243 కోట్లు విడుదల చేసింది. ఇక పండగ పూట నిధులు జమకావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ యంత్రాంగం, కాంట్రాక్టర్లు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.