High Court: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పిటిషన్ కొట్టివేత.. తదుపరి విచారణ మే 5కు వాయిదా వేసిన హైకోర్టు

సంగం డెయిరీ అక్రమాల కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

High Court: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పిటిషన్ కొట్టివేత.. తదుపరి విచారణ మే 5కు వాయిదా వేసిన హైకోర్టు
Ap High Court Rejects Dhulipalla Narendra’s Quash Petition

Updated on: Apr 29, 2021 | 1:41 PM

Sangam Dairy Case: సంగం డెయిరీ అక్రమాల కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే, రిమాండ్‌ అంశంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఈనెల 23న గుంటూరు జిల్లాలోని చింతలపూడిలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసింది. ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌పై హైకోర్టులో ధూళిపాళ్ల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కేసుపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.

Read Also…  వెనక్కు తగ్గిన ‘నారప్ప’ టీం.. ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తున్నాం అంటూ ట్వీట్..