Sajjala Ramakrishnareddy: ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

|

Jan 12, 2021 | 4:12 PM

Sajjala Ramakrishnareddy: ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని, రాజకీయ శక్తుల ప్రోద్బలంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని...

Sajjala Ramakrishnareddy: ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
Follow us on

Sajjala Ramakrishnareddy: ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని, రాజకీయ శక్తుల ప్రోద్బలంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు కొందరు లేనిపోని కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నీచమైన రాజకీయాలకు పేరుగాంచిన ప్రతిపక్ష పార్టీ కుట్రే ఇదని వ్యాఖ్యానించారు.

ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చే స్పందన చూసి ఓర్వలేక ఇలాంటివి చేస్తోందని మండిపడ్డారు. ఆలయాలపై దాడుల ఘటనపై సిట్‌ విచారణ జరుగుతోందని, విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వెళ్లడం ఖాయమన్నారు. కోర్టులో ఆలస్యమవుతోందని, కోర్టును ఒప్పిస్తామన్నారు. నాలుగైదు నెలల్లో వెళ్లే అవకాశం ఉందని సజ్జల అన్నారు.

Also Red: Shock To TDP: టీడీపీకి భారీ షాక్.. 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా