Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌ను వీడని ఏపీ యువకుడు.. అక్కడి నుంచి కదిలేది లేదంటున్నాడు.. కారణం తెలిస్తే షాకవుతారు

|

Mar 05, 2022 | 9:38 AM

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతోంది. ఓ తెలుగు యువకుడు మాత్రం అక్కడి నుంచి కదిలేది లేదంటున్నాడు. అందుకు కారణం తెలిస్తే మాత్రం షాకవుతారు...

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌ను వీడని ఏపీ యువకుడు.. అక్కడి నుంచి కదిలేది లేదంటున్నాడు.. కారణం తెలిస్తే షాకవుతారు
Follow us on

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతోంది. ఓ తెలుగు యువకుడు మాత్రం అక్కడి నుంచి కదిలేది లేదంటున్నాడు. అందుకు కారణం తెలిస్తే మాత్రం షాకవుతారు. పదో రోజు కొనసాగుతున్న ఈ పోరులో ఎవరికి వారు తగ్గేదిలే అన్నట్లు కొనసాగుతోంది. దీంతో ఇక్కడి జనాలు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ఉక్రెయిన్‌ (Ukraine)లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు (Students), పౌరులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. కానీ ఇంత యుద్ధం జరుగుతున్నా.. తాను మాత్రం ఆ దేశాన్ని వీడేది లేదంటున్నాడు ఓ తెలుగు యువకుడు. అయితే అందుకు అతను చెప్పిన కారణం వితంగా ఉంది. తాను ఉక్రెయిన్‌ను వదిలి రాకపోవడానికి కారణం ఓ చిరుత పులి అంటున్నాడు. అవును చిరుత పులే అతడ్ని అక్కడి నుంచి రానివ్వడం లేదంట. అది అతడి పెంపుడు పులి అని అంటున్నాడు ఆ యువకుడు.

ఏపీలోని తణుకుకు చెందిన కుమార్ ఉక్రెయిన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. యూట్యూబ్‌లో జాగ్వార్ కుమార్‌గా అతడు సురిచితుడే. అతడికి పులులంటే కూడా అమితమైన ఇష్టం. లంకేశ్వరుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిరుతను పెంచుకోవడం చూసిన కుమార్.. తాను కూడా పులిని పెంచుకోవాలని భావించాడు. ఉక్రెయిన్ వెళ్లిన తర్వాత అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఓ బుల్లి పులిపిల్లను తెచ్చుకున్నాడు. అది కూడా మన కుమార్‌కు బాగా దగ్గరైంది. ఇక్కడి దాకా బాగానే ఉన్నా, తాజా యుద్ధం అసలు సమస్యగా మారింది. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో తాను నివసించే ప్రాంతంలోని వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కానీ కుమార్ మాత్రం జాగ్వార్‌తో కలిసి బంకర్‌లోనే ఉంటున్నాడు.

ప్రాణాల మీదకు వచ్చినా, తాను పెంచుకుంటున్న పులికోసం కదిలేది లేదంటున్నాడు. కుమార్ గ‌త 19 నెల‌లుగా ఈ పులిని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం యుద్దం జ‌రుగుతున్న ప్రాంతంలో తాను ఒక్కడినే ఉన్నాన‌ని, తాను ఉంటున్న ప్రాంతంలో ప్రజ‌లంద‌రూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయార‌ని చెబుతున్నారు కుమార్. కానీ, యూట్యూబ్‌లో కుమార్ వీడియోలు చూసిన నెటిజన్లు, స్నేహితులు ఉక్రెయిన్ వదిలి వచ్చేయాలని సూచిస్తున్నారు. యుద్ధం ముగిసిన ఇంకా ఇక్కడే ఉండి, తర్వాతి పరిస్థితులను యూట్యూబ్ అప్‌లోడ్ చేస్తానని అంటున్నాడు కుమార్.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine Crisis: నా కొడుకు తీవ్ర గాయాలతో బతికే ఉన్నాడు.. భారత్ తీసుకురండి.. వేడుకుంటున్న హర్జీత్ తల్లిదండ్రులు

Russia-Ukraine War: రణరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్న విద్యార్థులు.. వారు పడ్డ కష్టాలను తలచుకుంటూ..