Trees Marriage Video: చెట్లను మొక్కడం సహజం.. కానీ చెట్లకు పెళ్లా..? ఆపై విందు భోజనం.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Trees Marriage Video: చెట్లను మొక్కడం సహజం.. కానీ చెట్లకు పెళ్లా..? ఆపై విందు భోజనం.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Anil kumar poka

|

Updated on: Mar 05, 2022 | 8:18 AM

తెలుగు రాష్ట్రాల్లో చెట్లకు పూజలు చేయడం సహజమే. ఒకే చోట పెరిగి ఉన్న వేప రావి చెట్టుకు పెళ్లి చేసి, పూజలు చేస్తే వివాహం అవుతుందని, శుభం కలుగుతుందనే నమ్మకంతో భక్తితో పూజిస్తారు. రావి వేప చెట్టు చుట్టూ తిరిగి భక్తిశ్రద్దలను చాటి వారికున్న నమ్మకాన్ని ప్రదర్శిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో చెట్లకు పూజలు చేయడం సహజమే. ఒకే చోట పెరిగి ఉన్న వేప రావి చెట్టుకు పెళ్లి చేసి, పూజలు చేస్తే వివాహం అవుతుందని, శుభం కలుగుతుందనే నమ్మకంతో భక్తితో పూజిస్తారు. రావి వేప చెట్టు చుట్టూ తిరిగి భక్తిశ్రద్దలను చాటి వారికున్న నమ్మకాన్ని ప్రదర్శిస్తారు. కొన్ని చోట్ల పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఇలాంటి చెట్ల పెళ్లి తంతు ఒకటి తిరుపతిలో ఘనంగా జరిగింది.చిత్తూరు జిల్లా తిరుపతిలో రావి వేప చెట్టుకు ఘనంగా పెళ్లి జరిపించారు స్థానికులు. గత 11 ఏళ్లుగా సంప్రదాయంగా వేదమంత్రాల మద్య వివాహం జరిపిస్తున్న చిగురువాడ వాసులు బంధు, మిత్రులను కూడా రావిచెట్టు వేప చెట్టు కు జరిగే పెళ్లికి ఆహ్వానించారు. తిరుపతి రూరల్ లోని అవిలాలలో వేప చెట్టుకు, రావి చెట్టుకు ఈ పెళ్లి జరిపించారు. వధూవరుల్లా రావి చెట్టు, వేప చెట్టుకు పట్టువస్త్రాలు కట్టి, కంకణాలు కట్టి సాక్షాత్తు శివ పార్వతులకే పెళ్లి జరిపించామన్న ఆనందంతో వివాహా వేడుక నిర్వహించారు. చిగురవాడకు చెందిన ముత్యాలయ్య, పద్మావతి దంపతులు పట్టు వస్త్రాలు ధరించి కన్యాదానం చేశారు. అర్చకుడి వేదమంత్రాలతో అగ్ని సాక్షిగా హోమం నిర్వహించారు. వేప రావి చెట్టు కలిసి ఉన్న చోట పందిళ్లు వేసి మంగళవాయిద్యాల నడుమ మూడుముళ్లు వేయించి వేడుక జరిపించారు. అనంతరం అతిథులందరికీ వివాహ విందు ఏర్పాటు చేసారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్