Mantralaya Hundi Collection: రికార్డ్‌ స్థాయిలో మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి హుండీ ఆదాయం.. ఎంతో తెలుసా..?

ప్రతి నెల మాదిరిగానే మే నెలలో కూడా మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తడంతో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. స్వామివారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో శ్రీమఠం చరిత్రలో కానుకలు వెల్లువెత్తాయి. 34 రోజుల్లో శ్రీరాఘవేంద్ర స్వామి హుండీ ఆదాయం..

Mantralaya Hundi Collection: రికార్డ్‌ స్థాయిలో మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి హుండీ ఆదాయం.. ఎంతో తెలుసా..?
Mantralayam
Follow us
Subhash Goud

|

Updated on: Jun 01, 2023 | 10:39 AM

ప్రతి నెల మాదిరిగానే మే నెలలో కూడా మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తడంతో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. స్వామివారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో శ్రీమఠం చరిత్రలో కానుకలు వెల్లువెత్తాయి. 34 రోజుల్లో శ్రీరాఘవేంద్ర స్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం రూ.3 కోట్ల 53 లక్షలు విరాళాల వచ్చినట్లు తెలిపారు. భక్తులు, దాతలు హుండీలో వేసిన కానుకలను లెక్కించగా, రూ.3,46,20,432 విలువైన నోట్లు, రూ.7,59,420 విలువైన నాణేలు వచ్చాయి.

అంతేకాకుండా అదనంగా 197 గ్రాముల బంగారం,1 కేజీ 187 గ్రాములు వెండి కూడా భక్తులు సమర్పించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. కేవలం 34 రోజుల్లో 3.53 కోట్ల ఆదాయం రావడం ఆలయ చరిత్రలో మొదటిసారి అని చెబుతున్నారు. అలాగే శ్రీ మఠంలో ప్రతి నెలలాగే మే నెలతో సహా 34 రోజుల్లో రాయల మఠానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల నేపథ్యం ఏప్రిల్-మే నెలల్లో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 34 రోజుల హుండీని ఆలయ సిబ్బంది, భక్తులు లెక్కించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి