Covid-19 Mask: ఏపీలోని ఈ నగరంలో మాస్క్ లేకుండా బయటకొస్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సిందే..!

|

Aug 09, 2021 | 8:27 PM

Covid Mask: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసింది. ఇక దేశంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌,  వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా వైరస్‌..

Covid-19 Mask: ఏపీలోని ఈ నగరంలో మాస్క్ లేకుండా బయటకొస్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సిందే..!
Follow us on

Covid Mask: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసింది. ఇక దేశంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌,  వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా వైరస్‌ కాస్త అదుపులోకి వచ్చింది. ఇక ఏపీలో కూడా కరోనా కట్టడికి చర్యలు భారీగానే చేపట్టింది ప్రభుత్వం. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. కొన్ని జిల్లా్ల్లో మాత్రం తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇక తాజాగా గుంటూరులో క‌రోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. గుంటూరు నగరంలో ఎవరైనా మాస్క్‌ లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా చెల్లించాల్సిందేనని నగర కార్పొరేషన్‌ హెచ్చరించింది. వాణిజ్య సముదాయాల వద్ద నో మాస్క్ బోర్డు లేకుంటే ఫైన్ వేస్తామని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ఈ సందర్భంగా నగరంలో కార్పొరేషన్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఇలా నో మాస్క్‌ బోర్డులు లేకుండా ఉంటే పోలీసులు కేసులు నమోదు చేస్తారని నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లా అనురాధ హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని, బయటకు వచ్చిన వారు తప్పకుండా మాస్క్‌ ధరించి ఉండాలని, అలాగే భౌతిక దూరం పాటించాలని సూచించారు. కొందరు అజాగ్రత్తగా ఉంటూ మాస్క్‌ లేకుండా బయటకు రావడం వల్ల పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆమె హెచ్చరించారు.

కాగా, కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివాహాలు, ధార్మిక సభలు, సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యకు పరిధి నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. గరిష్టస్థాయిలో 150 మందికి మాత్రమే ఈ తరహా సమూహ కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు అనుమతి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ కార్యక్రమాల సందర్భంగా మాస్కులు ధరించటం, శానిటైజేషన్ లాంటివి తప్పనిసరి అని స్పష్టం చేసింది జగన్‌ సర్కార్‌.

ఇవీ కూడా చదవండి

Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ

Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పెళ్లిళ్లు, సభలు, సమావేశాలకు లిమిట్… అతిక్రమిస్తే