నడికుడి రైల్వే జంక్షన్ లో దోపిడీ.. రూ.89 లక్షలతో ఉడాయించిన దుండగులు

|

Mar 08, 2022 | 8:20 AM

గుంటూరు జిల్లా నడికుడి(Nadikudi) రైల్వే స్టేషన్ లో దోపిడీ జరిగింది. స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుల నుంచి రూ.89 లక్షలు దోచుకుని...

నడికుడి రైల్వే జంక్షన్ లో దోపిడీ.. రూ.89 లక్షలతో ఉడాయించిన దుండగులు
Nadikudi
Follow us on

గుంటూరు జిల్లా నడికుడి(Nadikudi) రైల్వే స్టేషన్ లో దోపిడీ జరిగింది. స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుల నుంచి రూ.89 లక్షలు దోచుకుని పారిపోయారు. అదే జిల్లాలోని దుర్గి(Durgi) మండలానికి చెందిన ప్రకాశరావు, అజయ్ కుమార్, రామ శేషయ్యలు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నడికుడి రైల్వే జంక్షన్ కు వచ్చారు. అక్కడి నుంచి చెన్నై(Chennai) వెళ్లేందుకు టిక్కెట్లు తీసుకున్నారు. వీరు తమతో పాటు రెండు బ్యాగులను తీసుకొచ్చారు. ప్లాట్ ఫాం పై రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో కారులో నుంచి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వ్యాపారుల వద్దకు వచ్చి, పోలీసులు పిలుస్తున్నారని చెప్పారు. వారిని ఏమార్చి రెండు బ్యాగులను తీసుకుని ఉడాయించారు. తేరుకున్న బాధితులు లబోదిబోమంటూ రైల్వే పోలీసులకు విషయాన్ని వివరించారు.

రెండు బ్యాగుల్లో రూ.89 లక్షలు నగదు ఉందని, తమను మాటల్లో పెట్టి, బ్యాగులు తీసుకుని పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నగదు మొత్తాన్ని వ్యాపార పనుల కోసం చెన్నై తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిందని వాపోయారు. బాధితుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడు ప్రాంతంలోని పలు పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలిసిన వ్యక్తులే దోపిడికి పాల్పడి ఉంటారని వ్యాపారులు భావిస్తున్నారు.

టి. నాగరాజు, టీవీ 9 తెలుగు, గుంటూరు

ఇవీ చదవండి

Viral Video: చిన్న పిళ్ళాడిని చుట్టుముట్టిన భారీ అనకొండలు.. వీడియో చూస్తే వెన్నులోవణుకు పుట్టాల్సిందే..

Multiplex Business: ఆ రెండు సంస్థల విలీనం.. డీల్ జరిగితే సినిమా వ్యాపారంలో పెను మార్పే..

Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ మంత్రి కూతురు.. తండ్రి నుంచి రక్షణ కావాలంటూ పోలీసులకు విజ్ఞప్తి..