Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పిరిట్(హైడ్రో క్లోరిక్ యాసిడ్HCL)తో వెళ్తున్న ట్యాంకర్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ ధ్వంసం అయ్యింది. స్పిరిట్ ట్యాంకర్‌కు రంధ్రం పడటంతో.. అది లీక్ అవుతోంది. ఫలితంగా పొగలు వస్తున్నాయి. దాంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లాలోని బేస్తవారి పేట సమీపంలో అనంతపురం-అమరావతి రాష్ట్రీయ రహదారిపై జరిగింది.
వివరాల్లోకెళితే, స్పిరిట్ హైడ్రో క్లోరిక్ యాసిడ్ ట్యాంకర్.. కర్నూలు నుంచి వైజాగ్ లారస్ ల్యాబ్ మెడిసిన్స్ ఫ్యాక్టీరికి వెళ్తోంది. ఆదివారం ఉదయం సమయంలో అనంతపురం-అమరావతి రాష్ట్రీయ రహదారిపై ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట సమీపానికి చేరుకోగానే ఈ ట్యాంకర్‌ను ఓ టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ ధ్వంసం అయ్యి రంధ్రం పడింది. దాంతో అందులో ఉన్న లిక్విడ్ లీక్ అవుతోంది. బయటకు లీక్ అయిన లిక్విడ్ నుంచి పొగలు వస్తున్నాయి. దాంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అయితే, విషయం తెలుసుకున్న బేస్తవారిపేట ఎస్ఐ మాధవరావు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రజలెవరూ రాకుండా పోలీసు సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. అలాగే హైవేపై ప్రయాణిస్తున్న వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
Also read:
Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. తీవ్ర భయాందోళనలో ప్రజలు.. అసలేం జరిగిందంటే..
Chiranjeevi: చిరంజీవి – మెహర్ రమేష్ సినిమా టైటిల్ వచ్చేసింది.. మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్.