Andhra Pradesh: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని.. సంతోషముగా తాము వచ్చిన వాహనంలో ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. తమ ఊరి సరిహద్దు ప్రాంతంలోకి చేరుకున్నారు. మరికొంత సమయంలో తమ ఇంటికి వెళ్లిపోతామని భావిస్తున్న ప్రయాణీకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. చిమ్మ చీకట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ వాహనంలో ఉన్నవారికి ఏమి జరిగిందో అర్ధం కాని పరిస్థితి… తమను రక్షించండి అంటూ ఆర్తనాదాలతో అర్ధరాత్రి రహదారి ఓ భయంకరమైన ప్రమాదానికి సాక్ష్యంగా ఓ కరెంట్ ఆఫీస్ నిలిచింది. ఈ దారుణమైన ప్రమాదం పల్నాడు జిల్లాలోని చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే..
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్నటాటా ఏస్ వాహానం.. రెంటచింతలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఆగి ఉన్న లారీ ను ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీ కొట్టింది. దీంతో అందులో కిక్కిరిసి ప్రయాణిస్తున్న వారాంతం ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాద సమయంలో టాటా ఎస్ వాహనంలో 38 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణం చీకటి తో పాటు.. డ్రైవర్ రహదారిపై ఆగి ఉన్న ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..