వరి బియ్యం(Rice Grain) కేవలం తినే పదార్థమేనా.. దానితో మరే ఉపయోగాలు లేవా.. ఇలా అలోచిస్తే మనకు ఎన్నో ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయి. వరి కేవలం ఆహరధాన్యం మాత్రమే కాదు. ఒక విలువైన పదార్థం అనడంలో ఏం సందేహం లేదు. వరి ఉత్పత్రి భారీగా పెరగడంతో వరి సాగు చేయవద్దని సూచిస్తున్న ప్రభుత్వాలు.. వరి కోసం ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభిస్తే చాలా లాభదాయకంగా ఉంటుందని, ఎంత ఉత్పత్తి వచ్చినా దానిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరితో వంటల్లో ఉపయోగించే రైస్ బ్రాన్ అయిల్(Rice bran Oil) ను తయారు చేస్తున్నారు. విటమిన్ ఈ అధికంగా ఉండే ఈ రైస్ బ్రాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వాలు ఈ దిశగా అయిల్ ఉత్పత్తిని ప్రొత్సహిస్తే ప్రపంచవ్యాప్తంగా రైస్ బ్రాన్ అయిల్ ను సరఫరా చేసే అవకాశం ఉంది. రైస్‌తో ఇథనాయిల్(Ithanal) తయారుచేయచ్చనే విషయం చాలా మందికి తెలియదు. పెట్రోల్, డీజిల్‌లో ఇథనాయిల్ మిక్స్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. వరితో ఇథనాయిల్ తయారుచేయడానికి పెట్టుబడి వ్యయం భారీమెత్తంలో అవసరం అవుతుంది. కాని తర్వాత ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇజ్రాయిల్ ఇప్పటికే ఇలాంటి రియాక్టర్‌లను నెలకొప్పి వరి నుంచి ఇథనాయిల్ తయారు చేస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న వరిని ఇథనాయిల్‌గా మారిస్తే రైతులకు మరింత మద్దతు ధర కల్పించే అవకాశం ఉంది.
వరి రా ధాన్యంతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటికీ డిమాండ్ బాగానే ఉంది. కొన్ని దేశాల్లో ఆర్మీ అహార అవసరాల కోసం, చలి ప్రాంతాల్లో అహార నిల్వగా ఈ బిస్కెట్లను వాడతారు. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినపుడు కూడా కొన్ని దేశాల్లో గోధుమలు, వరితో తయారుచేసిన బిస్కెట్ ప్యాకెట్లను ప్రజలకు పంచుతారు. మామూలు బిస్కెట్లతో పోలిస్తే వీటిలో కార్బోహైడ్రెట్స్ ఎక్కువగా ఉండడం, ప్రత్యేక పరిస్థితుల్లో అకలి తీర్చేందుకు మంచి మార్గం అంటున్నారు శాస్త్రవేత్తలు. బియ్యంతో తయారుచేసే పేలాలు, మరమరాలకు కూడా ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మట్టిపాత్రల తరహాలో వరి ధాన్యంతో పాత్రలు తయారుచేసే అవకాశం ఉంది. మరిన్ని వస్తువులను తయారుచేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే ఈ విధానంలో మరింత ప్రయెగాలు జరగాల్సి ఉంది.
వరిని ఆహర ధాన్యంగానే చూస్తున్న కేంధ్ర ప్రభుత్వం.. లక్షల టన్నుల బియ్యాన్ని గోధాముల్లో నిల్వ ఉంచుతోంది. మరోవైపు దేశ అవసరాలకు మించి రెట్టింపు పంట ఉత్పత్తి అవుతోంది. విదేశాలకు ఎగుమతి చేయడానికి ఇతర దేశాల చౌక బియ్యం పోటీగా మారుతోంది. మనదేశంలో పండే బియ్యం తినేందుకు ఎంత ఉపయోగపడుతుందో ఇతర ఉత్పత్తులనూ తయారుచేసేందుకు అంతకంటే ఎక్కువగా పనికొస్తుందంటున్నారు నిపుణులు. ఇలాంటి ప్రత్యామ్నాయ ఉత్పత్తుల పరిశ్రలు ప్రారంభిస్తే రైతులకు ఇటు ప్రభుత్వానికి అవస్థలు తగ్గే అవకాశం ఉంది.
Also Read
Janhvi Kapoor: 25వ పుట్టినరోజు శ్రీవారి సన్నిధిలో జరుపుకున్న జాన్వీ కపూర్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Indian Politics: ప్రాంతీయ పార్టీల హవాతో మునిగిపోతున్న కాంగ్రెస్.. ఎదురీదుతున్న బీజేపీ..