Sudan Crisis: సూడాన్‌లో చిక్కుకుపోయిన కాకినాడ వాసులు.. సాయం కోసం ఎదురుచూపు..

|

Apr 30, 2023 | 9:37 AM

సూడాన్ నిరంతర ఘర్షణలతో అట్టుడుకుతోంది. దీంతో సూడాన్‌ నుంచి భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’ని వేగవంతంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే కేంద్రం వందలాదిమందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగా.. మరికొంతమంది అక్కడే చిక్కుకుపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

Sudan Crisis: సూడాన్‌లో చిక్కుకుపోయిన కాకినాడ వాసులు.. సాయం కోసం ఎదురుచూపు..
Sudan Crisis
Follow us on

సూడాన్ నిరంతర ఘర్షణలతో అట్టుడుకుతోంది. దీంతో సూడాన్‌ నుంచి భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’ని వేగవంతంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే కేంద్రం వందలాదిమందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగా.. మరికొంతమంది అక్కడే చిక్కుకుపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. సుడాన్ లో సైన్యం, పారామిలటరీ అధికార పోరు.. తీవ్ర రూపం దాల్చింది. దీంతో వారి కాల్పుల్లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఏపీలోని కాకినాడకు చెందిన దంపతులు సుడాన్‌లో చిక్కుకుపోయారు. స్వదేశానికి వచ్చేందుకు అహ్మద్‌వలీ, ముంతాజ్‌లు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమ వాళ్లను స్వదేశానికి తీసుకురావాలని అహ్మద్ వలీ కుటుంబసభ్యులు విఙ్ఞప్తి చేస్తున్నారు.

అహ్మద్‌ వలీ కెనానా షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆయనతో పాటు మరో 52మంది తెలుగు వాళ్లు అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సైన్యం, పారామిలటరీ మధ్య గొడవలతో సుడాన్ అట్టుడుకిపోతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో తెలుగువాళ్లు వణికిపోతున్నారు.

మరోవైవు ఆపరేషన్ కావేరి కొనసాగుతోంది. ఇప్పటిదాకా వెయ్యిమందికి పైగా సుడాన్‌ నుంచి స్వదేశానికొచ్చారు. ఇంకా 2, 400 మంది వరకు భారతీయులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అంతర్యుద్దంలో చిక్కుకున్న వాళ్లు… ఖార్తుం నుంచి పోర్ట్ సూడాన్‌.. వయా జెడ్డా మీదుగా భారత్‌కు తరలింపు ప్రక్రియ సాగుతోంది.

ఇవి కూడా చదవండి

సహాయక చర్యల కోసం రెండు సీ-130 వాయుసేన విమానాలు, మూడు నావికాదళ నౌకలు .. INS సుమేధ, INS తేగ్, INS తర్కష్‌ను ఉపయోగిస్తున్నారు. యుద్ధ సమయంలో డీజిల్, పెట్రోల్ కొరత సహా తరలింపు ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ భారతీయుల కోసం ఖార్తుం నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..