Pawan Kalyan Varahi : పవన్ కళ్యాణ్ ‘వారాహి’కి లైన్ క్లియర్.. క్యార్‌వ్యాన్‌ విషయంలో రూల్స్ ఫాలో అయినట్లు తేల్చిన రవాణాశాఖ

|

Dec 12, 2022 | 5:18 PM

వాస్తవానికి కలర్ లకు కోడ్స్ ఉంటాయి.. భారత ఆర్మీ సంస్థ ఉపయోగించే కలర్ కోడ్.. అంటే ఆర్మీ కలర్: 7B8165 కాగా.. ఇప్పుడు జనసేన అధినేత ఎన్నికల వాహనం వారాహి కలర్ కోడ్ :445c44 అని తెలుస్తోంది.

Pawan Kalyan Varahi : పవన్ కళ్యాణ్ వారాహికి లైన్ క్లియర్.. క్యార్‌వ్యాన్‌ విషయంలో రూల్స్ ఫాలో అయినట్లు తేల్చిన రవాణాశాఖ
Pawan Kalyan Varahi Vehicle
Follow us on

గత కొన్ని రోజులుగా అధికార వైసీపీ నేతలు, జనసేన నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైన జనసేన అధినేత ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. జనసేనాని పవన్ కళ్యాణ్ వాహనం రిజిస్ట్రేషన్ కు అన్ని అనుమతులు లభించాయి. వారాహి వాహనం ఆర్మీ ఉపయోగించే కలర్ లో ఉంది.. ఈ వాహనం రిజస్ట్రేషన్ కు ట్రాన్స్ పోర్ట్ శాఖ అనుమతినిస్తుందా.. పవన్ రీల్ లైఫ్ అనుకుంటున్నారు.. ఇది రియల్ లైఫ్ సినిమా కాదు అంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.. అయితే  వైసీపీ నేతలు చేసిన విమర్శలకు చెక్ పెడుతున్నట్లుగా ఇప్పుడు జనసేన అధినేత వాహనం వారాహికి అన్ని అనుమతులున్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు అనుమతులు ఇచ్చారు. అంతేకాదు.. ఇప్పటికే వారాహి వాహన రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. వాహనానికి ” TS13 EX 8384″నెంబర్ ను కేటాయించారు.

అయితే వాస్తవానికి కలర్ లకు కోడ్స్ ఉంటాయి.. భారత ఆర్మీ సంస్థ ఉపయోగించే కలర్ కోడ్.. అంటే ఆర్మీ కలర్: 7B8165 కాగా.. ఇప్పుడు జనసేన అధినేత ఎన్నికల వాహనం వారాహి కలర్ కోడ్ :445c44 అని తెలుస్తోంది. ఈ క్రమంలో వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

TS 13EX 8384. ఇదీ వారాహి నెంబర్‌. పైగా ఈ గ్రీన్‌.. ఆ గ్రీన్‌ కాదని తెలంగాణ రవాణా శాఖ తేల్చడంతో ఇక యుద్ధానికి బయల్దేరడమే ఆలస్యంగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ వారాహి రిజిస్ట్రేషన్‌పై ఓవైపు రచ్చ జరుగుతూ ఉండగానే రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందన్నది ఇప్పుడు వస్తున్న క్లారిటీ.

రంగు విషయంలో జరిగిన ఇంత వివాదం ఒక్కసారిగా ఎలా తేలిపోయిందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. వైసీపీ నేతలు విమర్శించిన దాన్నిబట్టి రవాణా శాఖ యాక్ట్‌ను ఉల్లంఘించి పవన్ తన వెహికిల్‌ని ఆలీవ్‌ గ్రీన్‌ని వినియోగించారని. కానీ అది ఆలీవ్‌ గ్రీన్ కాదు.. ఎమరాల్డ్‌ గ్రీన్ అని గుర్తించింది ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌. పైగా.. వెహికిల్‌కి ఈ కలర్ అద్దే సాధారణ పెయింటర్‌కు ఆర్మీ వినియోగించే ఆలీవ్ గ్రీన్ కలర్‌ బయట ఎక్కడా దొరకదు. జీఎస్టీ కొనుగోలు చేసి దొరికిందల్లా గ్రీన్‌లో మరోషేడ్‌గా ఉన్న ఎమరాల్డ్ గ్రీన్ మాత్రమే. దీనికీ ఆలీవ్‌ గ్రీన్‌కి కాస్త సారూప్యత ఉన్నా రెండూ వేరువేరు కావడంతో రిజిస్ట్రేషన్స్‌తో లైన్ క్లియర్ చేసింది ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌. పైగా పొడవు, వెడల్పు, క్యార్‌వ్యాన్‌ విషయంలో మిగతా రూల్స్‌ను జనసేన ఫాలో అయినట్లు తేలడంతో నెంబర్ కూడా ఇచ్చేశారు.

ఈ నెల 7న పవన్ కల్యాణ్‌ తన ఎన్నికల ప్రచారరథం వారాహి లుక్ రిలీజ్ చెయ్యడంతో మొదలైన మాటల యుద్ధం అంతా ఇంతా కాదు. ఆర్మీ వినియోగించే ఆలీవ్ గ్రీన్ కలర్‌ని పవన్ తన ప్రచారరథానికి ఎలా వినియోగిస్తారన్నది వైసీపీ నుంచి వచ్చిన విమర్శలు. కానీ.. అంతా చట్టం ప్రకారమే జరుగుతోందన్నది జనసేన నుంచి వచ్చిన మాట. మరి ఇపుడు ఈ విషయంపై వాహనం రిజిస్ట్రేషన్ పై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..