AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కోర్టు సినిమా తరహాలో కడపలో రియల్‌ సీన్‌ సంచలనం.. పోలీసుల సమక్షంలోనే..

కోర్టు సినిమా తరహాలో కడపలో రియల్‌ సీన్‌ సంచలనం రేపింది. దళిత యువకుడు విజయ్‌ ప్రేమపెళ్లి వివాదం కడప పీఎస్ ఎదుట ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికంగా ఈ కేసు చర్చనీయాంశమైంది.. పోక్సో కేసులో కుమారుడిని అరెస్టు చేయడంతో తల్లి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది..

Andhra: కోర్టు సినిమా తరహాలో కడపలో రియల్‌ సీన్‌ సంచలనం.. పోలీసుల సమక్షంలోనే..
Kadapa Incident
Shaik Madar Saheb
|

Updated on: May 21, 2025 | 9:40 AM

Share

కోర్టు సినిమా తరహాలో కడపలో రియల్‌ సీన్‌ సంచలనం రేపింది. దళిత యువకుడు విజయ్‌ ప్రేమపెళ్లి వివాదం కడప పీఎస్ ఎదుట ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికంగా ఈ కేసు చర్చనీయాంశమైంది.. పోక్సో కేసులో కుమారుడిని అరెస్టు చేయడంతో తల్లి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.. కడప శివారు రామారాజుపల్లెకు చెందిన విజయ్‌ అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమించాడు. కుటుంబసభ్యులకు తెలియడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. రెండు రోజుల కిందట వారు యువకుడిని పిలిపించి మైనర్‌ను వివాహం చేసుకుంటే కేసు నమోదవుతుందని హెచ్చరించి పంపించారు. ఈ నేపథ్యంలో ప్రేమికులిద్దరూ పారిపోయారు.

దీంతో యువతి తల్లి తాలూకా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి విజయ్‌ను పట్టుకుని, పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. విజయ్‌ అరెస్ట్‌ విషయం తెలుసుకున్న బంధువులు పీఎస్‌కు వచ్చారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విజయ్‌ను అరెస్ట్‌ చేశారని అతని పేరెంట్స్‌, బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

విజయ్‌ బంధువుల్లో ముగ్గురు పోలీసుల సమక్షంలో సూసైడ్ అటెంప్ట్‌ చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆ క్రమంలోనూ గొడవ జరిగింది. దీంతో స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు వాహనాన్నీ అడ్డుకోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. స్పెషల్‌పార్టీ పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.

పోలీసుల తీరుతో రచ్చ రచ్చ చేశారు విజయ్ తరపు భందువులు.. ఘటనపై వివరణ ఇచ్చిన స్టేషన్ CI నిబంధనల మేరకే.. నడుచుకున్నామన్నారు. తన కుమార్తెను విజయ్‌ తీసుకెళ్లినట్లు బాలిక తల్లి వచ్చి ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు పంపించామని చెప్పారు. తాము నిబంధనల మేరకు వ్యవహరించామని.. యువకుడి బంధువుల ఆరోపణలు నిరాధారమని సీఐ రెడ్డెప్ప చెప్పారు.