Krishna District: పురాతన ఇంటిని తొలగిస్తుండగా ఇంటి కప్పుపై కనిపించిన అత్యంత అరుదైన జీవి..

|

Apr 06, 2023 | 2:30 PM

వ్యక్తి తన పురాతన ఇంటిని తొలగిస్తుండగా ఇంటి కప్పుపై టార్పన్ల కింద ఉన్న ఓ జీవిని చూసి బంధించాడు. వెంటనే తనకు పరిచయం ఉన్న వెటర్నరీ అధికారులకు ఈ విషయం గురించి సమాచారం అందించాడు. వారు వచ్చి చూడగా...

Krishna District: పురాతన ఇంటిని తొలగిస్తుండగా ఇంటి కప్పుపై  కనిపించిన అత్యంత అరుదైన జీవి..
Punugu Pilli
Follow us on

కృష్ణా జిల్లా గుడివాడలో అరుదైన వన్యప్రాణి పునుగు పిల్లి ప్రత్యక్షమయ్యింది. నాగవరప్పాడులో ఔషధ వ్యాపారి నాగరాజు తన పురాతన ఇంటి కప్పుపై టార్పన్ల కింద తొలగిస్తుండగా ఈ పునుగు పిల్లి కనిపించింది. దట్టమైన అడవుల్లో కూడా అత్యంత అరుదుగా కనిపించే ఈ వన్యప్రాణి, జనావాసాల మధ్య కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకొని పునుగు పిల్లిని చూసేందుకు భారీగా స్థానికులు తరలివచ్చారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో.. వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తిరుమల వెంకన్న అభిషేకం కోసం పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని వాడతారు. పునుగు పిల్లి శరీరం.. గంధపు చెక్కకు రాజుకోవడం వల్ల పునుగు తైలం వస్తుంది. ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత.. శ్రీవారి తల నుంచి పాదాల దాకా పునుగుపిల్లి తైలం పులుముతారు. దీంతో శ్రీవారి విగ్రహానికి పగుళ్లు రావు. ప్రకాశమూ తగ్గదు.

పునుగుపిల్లి కనిపిస్తే చాటు టీటీడీ అధికారుల సంబరం మాములుగా ఉండదు. వెంటనే ఆ ప్రాంతంలో వాలిపోయి.. దాన్ని జాగ్రత్తగా .. తిరుమల తీసుకెళ్తారు. దాన్ని తిరుపతి, SV జూ పార్కులో ఉంచి సంరక్షిస్తారు. పునుగు పిల్లి అత్యంత అరుదైన జీవి. అంతరించిపోయే జాతికి చెందిన ఈ పునుగు పిల్లిని కాపాడాల్సిన బాధ్యత ఎంతో ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..