Vizag: మొక్కులు తీర్చేందుకు గుడికొచ్చిన భక్తులు.. శివుని విగ్రహం చూడగా.. తన్మయత్వంతో

మొక్కులు చెల్లించేందుకు గుడికొచ్చిన భక్తులు.. శివుని విగ్రహన్ని చూడగా కళ్లు జిగేల్‌మనిపించాయి. ఈ అరుదైన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఆ దృశ్యరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు. మరి ఆ వీడియో ఏంటో మీరూ ఓసారి లుక్కేయండి. ఇది మీకోసమే

Vizag: మొక్కులు తీర్చేందుకు గుడికొచ్చిన భక్తులు.. శివుని విగ్రహం చూడగా.. తన్మయత్వంతో
Andhra

Edited By:

Updated on: Apr 21, 2025 | 1:26 PM

విశాఖలో ఓ శివాలయంలో అద్భుతం జరిగింది. ఎప్పుడూ దీక్షలో ఉన్నట్టుగా కళ్లు మూసినట్టు ఉన్న శివుడి విగ్రహంలో.. ఈరోజు ఓ కన్ను తెరిచి ఉన్నట్టు కనిపించింది. ఎడమ కన్ను మూసి.. కుడి కన్ను తెరిచి చూస్తున్నట్టుగా ఆ దృశ్యం దర్శనమిచ్చింది. దీంతో ఈ అద్భుతాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. గాజువాక ఆటోనగర్ వెళ్లే మార్గంలో.. యాదవ జగ్గరాజుపేట సమీపంలోని బీహెచ్పీవీ గోడకు ఆనుకుని దుర్గా నాగలింగేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలో విగ్రహం స్వయంభుగా వెలిసింది. ఈ ఆలయంలోనే ఓ పెద్ద పుట్ట కూడా ఉంది. పుట్టకు ఆనుకొని శివుడు సుబ్రహ్మణ్యస్వామి నాగబంధం విగ్రహాలు కూడా ఉన్నాయి.

అయితే ప్రతిరోజు మాదిరిగానే అర్చకుడు ఉదయాన్నే ఆలయానికి వెళ్లారు. అక్కడ విగ్రహానికి విభూదితో అభిషేకం చేస్తున్నారు. ఈ సమయంలో శివుని కుడి కన్ను తెరిచి ఉన్నట్టు కనిపించింది. దీంతో అవాక్కైనా అర్చకులు.. పూజలు చేశారు. విషయాన్ని స్థానికులకు చెప్పారు. విషయం తెలుసుకొని ఆ దృశ్యాన్ని చూసేందుకు తరలివస్తున్నరు భక్తులు. స్వామివారి దర్శనానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి తమ పూజలు చేస్తున్నారు. గాజువాక నియోజకవర్గం ఆటోనగర్ యాదవ జగ్గరాజుపేట వెళ్లే మార్గంలో ఉన్న ఆలయంలో ఈ వింత చోటుచేసుకుంది. అయితే శివయ్య కుడి కన్ను తెరవడం గ్రామానికి అదృష్టమని కొంతమంది చెబుతుంటే.. అరిష్టమనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే.. విభూది అభిషేకం సమయంలో కంటి పై ఆకారం అలా ఏర్పడి ఉంటుందని మరికొందరు అంటున్నారు.