Vijayawada: ‘మీకు పిల్లలు పుట్టడం లేదా.. ఇవి ఇంట్లో ఉంటే చాలు’.. ఆ తర్వాత

సముద్రగర్భంలో 10 నుంచి 20 మీటర్ల లోతులో పరిశుభ్రమైన ప్రదేశంలో వివిధ వర్ణాల్లో నెమలి పురి విప్పినట్టుగా కనిపించే ఆకారాలవి. వీడియోలు, ఫొటోల్లో చూసిన వాళ్లంతా వాటిని సముద్రగర్భంలో పెరిగే మొక్కలు అనుకుంటారు. వన్యప్రాణి పరి భాషలో వాటిని సీ ఫ్యాన్స్‌ అని పిలుస్తారు.

Vijayawada: మీకు పిల్లలు పుట్టడం లేదా.. ఇవి ఇంట్లో ఉంటే చాలు.. ఆ తర్వాత
Sea Fans

Updated on: Jun 23, 2024 | 8:08 PM

విజయవాడ కేంద్రంగా వైల్డ్‌ లైఫ్‌ యానిమల్‌ స్మగ్లింగ్‌ జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో వైల్డ్‌ లైఫ్‌ యానిమల్‌ స్మగ్లింగ్‌ పట్టుబడటం దేశంలో మొదటిసారని అధికారులు చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ ఇచ్చిన సమాచారం మేరకు రెక్కీ నిర్వహించి నిందితుడు శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. సముద్రగర్భంలో నివసించే సీఫ్యాన్స్‌ను దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 900 సీఫ్యాన్స్ సీజ్‌ చేశారు అధికారులు. నిందితుడు శ్రీనివాస్ ఒక్కొక్కటి ఫొటో ఫ్రేముల్లో పెట్టి లక్షల్లో అమ్మకాలు చేసినట్లుగా అధికారుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.

లక్ష్మీ కటాక్షం, పెళ్ళి కావటం, పిల్లలు పుట్టడం, భార్యభర్తలు కలిసి ఉండాలంటే ఇవి ఇంట్లో ఉంటే మంచిదంటూ శ్రీనివాస్‌ యూట్యూబ్‌లో విస్తృత ప్రచారం చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. యూట్యూబ్‌లో వీటి అమ్మకాలు చూసి వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ స్వయంగా రంగంలోకి దిగింది. వివిధ జంతువుల చర్మాలు, వెంట్రుకలు, పాము కుబుసం, జింక చర్మం, సముద్రపు తేళ్లును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతరించిపోతున్న వైల్డ్‌ లైఫ్‌ ప్రాణుల జాబితాలో సీ ఫ్యాన్స్‌ ఉన్నాయని అధికారులు తెలిపారు. చూడటానికి చెట్టు మాదిరిగా ఉండే సీ ఫ్యాన్స్‌ ప్రాణముండి సముద్రంలో 20 మీటర్ల లోతులో జీవిస్తాయన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…