Chakkarakeli White Banana: సేంద్రీయ ఎరువులతో భారీ అరటిగెలను పండించిన రైతు.. చూడడానికి క్యూ కడుతున్న జనం

|

Jun 19, 2021 | 4:12 PM

Chakkarakeli White Banana: రసాయన ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి హానికరమే కాదు.. భూ సారం కూడా త్వరగా పాడైపోతుందని.. ఇప్పుడిప్పుడే రైతులలో...

Chakkarakeli White Banana:  సేంద్రీయ ఎరువులతో భారీ అరటిగెలను పండించిన రైతు.. చూడడానికి క్యూ కడుతున్న జనం
Rare Banana Bunch
Follow us on

ప్రజల్లో అవగాన పెరుగుతుంది. దీంతో రైతులు సేంద్రీయ ఎరువులతో పంటలు పండించడానికి .. నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ప్రజలు కూడా సేంద్రీయ ఆహారపుఁ పంటలను తినడానికే ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కు చెందిన ఓ రైతులు సేంద్రీయ ఎరువులు వాడితే.. నాణ్యమైన ఉత్పత్తులను పండించవచ్చు అని రుజువు చేశాడు.. వివరాల్లోకి వెళ్తే..

ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన అరటి తోట వేశారు. ఈ అరటి తోటకు సేంద్రీయ ఎరువులను వాడేవారు దీంతో ఆయన తోటలో తెల్ల చక్రకేళీ గెల మూడున్నర అడుగులు పైగా పెరిగింది. ఏకంగా 140 వరకు పండ్లు(30 కిలోలు)తో అబ్బుర పరుస్తోంది. సాధారణంగా రెండున్నర అడుగులు వరకు గెల వేసి, దానికి 60 వరకు పండ్లు(10 కిలోలు) ఉంటాయి.

ఇదే విషయంపై ఉద్యాన అధికారి అమరనాథ్ స్పందిస్తూ.. సేంద్రియ ఎరువులను వినియోగించడం, సారవంతమైన నేల కావడంతో ఇలా పెద్ద గెలలు వేసి ఎక్కువ కాయలు కాసాయని చెప్పారు. అయితే ఇది అరుదుగా జరిగే సంఘటన అన్నారు. తోటలో పండిన ఈ భారీ అరటి గెలను చూడడానికి స్థానికులు సుబ్బరాజు తోటకు క్యూ కడుతున్నారు. దీంతో అయన హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  ప్రపంచదేశాల్లో ఆగని కరోనా కల్లోలం.. నాలుగు మిలియన్లు దాటిన మరణాల సంఖ్య