Big Fish: జాలరి పంట పండింది.. వలకు చిక్కిన బాహుబలి చేప.. దీని స్పెషల్ ఏంటంటే

|

Jul 20, 2022 | 6:07 PM

Andhra Pradesh: సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే జాలర్లు.. ఒక్కోసారి వారం రోజులైనా తీరానికి చేరుకోలేని పరిస్థితి. చేతినిండా చేపలు దొరికితేనే వారు తమ భార్యాపిల్లలను పోషించుకోగలుగుతారు. లేదంటే పొట్ట కూటి కోసం పాట్లు పడాల్సిందే.

Big Fish: జాలరి పంట పండింది.. వలకు చిక్కిన బాహుబలి చేప.. దీని స్పెషల్ ఏంటంటే
Bahubali Fish
Follow us on

Andhra Pradesh: సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే జాలర్లు.. ఒక్కోసారి వారం రోజులైనా తీరానికి చేరుకోలేని పరిస్థితి. చేతినిండా చేపలు దొరికితేనే వారు తమ భార్యాపిల్లలను పోషించుకోగలుగుతారు. లేదంటే పొట్ట కూటి కోసం పాట్లు పడాల్సిందే. అయితే ఇటీవల సముద్రంలోని వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేపలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఎక్కువగా భారీ చేపలు వలకు దొరుకుతున్నాయి. వేలంలో ఇవి లక్షరూపాయల దాకా అమ్ముడుపోతున్నాయి. ఈక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి కూడా ఇలాంటి భారీ బరువు గల చేప చిక్కింది. ఈ చేప బరువు అక్షరాలా 20 కిలోలు.

కాగా దీనిని చేపల్లో బాహుబలిగా పరిణగిస్తారు. అందుకే ఈ చేపను చూడడంతో పాటు కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. చివరికి ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజకు చెందిన చేపల వ్యాపారి రామారావు రూ.3 వేలు చెల్లించి ఈ బాహుబలి చేపను సొంతం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..